మ‌ద‌న‌ప‌ల్లె ద‌శ మారిపోయేలా స‌రికొత్త డీపీఆర్ రెడీ అవుతోంద‌ని (PKM - UDA) ఛైర్మ‌న్ డాక్ట‌ర్ బీఆర్‌. సురేష్‌బాబు తెలిపారు. వారం రోజుల క్రితం (PKM - UDA) ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆయ‌న (PKM - UDA) అభివృద్ధి విష‌యంలో త‌న విజ‌న్ ఏంటో చెప్పేశారు. మ‌ద‌న‌ప‌ల్లి, కుప్పం, తంబ‌ళ్ల‌ప‌ల్లి, పుంగ‌నూరు, ప‌ల‌మ‌నేరు మున్సిపాల్టీల‌లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు (PKM - UDA) ఆధ్వ‌ర్యంలో చేసేలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నట్టు తెలిపారు. ఈ క్ర‌మంలోనే మున్సిపాల్టీలు అన్నింటికి ఓ మాస్ట‌ర్ ప్లాన్ త‌యారు చేయాల‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్ర‌భుత్వం అమృత్ 2 ప‌థ‌కంలో భాగంగా మ‌ద‌న‌ప‌ల్లి మున్సిపాల్టీ మాస్ట‌ర్ ప్లాన్ ఇప్ప‌టికే ప్ర‌భుత్వం నుంచి ఆమోదం పొందింద‌న్నారు. పుంగ‌నూరు, ప‌ల‌మ‌నేరు మున్సిపాల్టీల మాస్ట‌ర్ ప్లాన్స్ ఇంకా ఆమోదం పొందాల్సి ఉంద‌ని... ఈ మాస్ట‌ర్ ప్లాన్ అమ‌లు చేసేందుకు ఎంత ఖ‌ర్చ‌వుతుంది.. ఏమేం చేయాల‌నే దానిపై ఓ బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక సిద్ధ‌మ‌వుతోన్న‌ట్టు తెలిపారు.


ఇందులో భాగంగానే మ‌న‌ద‌పల్లి మున్సిపాల్టీని స్థానిక ఎమ్మెల్యే షాజ‌హ‌న్ బాషా గారితో పాటు మంత్రి రాం ప్ర‌సాద్‌రెడ్డి గారి స‌హ‌కారంతో ఓ వెల్ ప్లాన్ మున్సిపాల్టీగా తీర్చిదిద్దాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.... మ‌ద‌న‌ప‌ల్లితో పాటు పుంగ‌నూరు, ప‌ల‌మ‌నేరు, కుప్పంను మోడ‌ల్ మున్సిపాల్టీగా త‌యారు చేస్తామ‌న్నారు. డీపీఆర్ వ‌చ్చిన వెంట‌నే మ‌ద‌న‌ప‌ల్లిని మోడ‌ల్ మున్సిపాల్టీగా చేసే ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెప్పారు. రోడ్ల వెడ‌ల్పు, మంచినీటి సౌక‌ర్యం, పారిశుధ్యం మెరుగుద‌ల‌, పారిశ్రామిక అభివృద్ధి, ఇంట‌ర్నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్స్‌, ఇత‌ర ప్ర‌జా ప్ర‌యోగ ప‌నుల విష‌యంలో స‌రికొత్త‌గా ముందుకు వెళుతూ మ‌ద‌న‌ప‌ల్లి మున్సిపాల్టీని ఓ వ‌ర‌ల్డ్ క్లాస్ మున్సిపాల్టీగా తీర్చిదిద్దుతాం. వ‌చ్చే 50 ఏళ్ల మ‌ద‌న‌ప‌ల్లి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మ‌ద‌న‌ప‌ల్లి కొత్త డీపీఆర్ రెడీ అవుతోంద‌న్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: