టీమిండియా మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆయన భార్య ఆర్తి ఆహ్లావత్ కు విడాకులు అయ్యాయా అనే ప్రశ్న అభిమానులలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది? గడిచిన రెండు సంవత్సరాల క్రితమే వీరిద్దరు విడిపోయారనే విధంగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ విషయం పైన అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. కానీ తాజాగా దీపావళి పండుగ సందర్భంగా సెహ్వాగ్ షేర్ చేసిన ఫోటోలతో ఈ విషయం మరొకసారి బయటపడింది.



సోషల్ మీడియాలో వీరేంద్ర సెహ్వాగ్  తల్లితో పాటు ఇద్దరు కొడుకులతో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ ఫ్యామిలీ ఫోటోలో భార్య ఆర్తి లేకపోవడంతో అభిమానులకు మరొకసారి విడాకుల వ్యవహారం ప్రశ్నగా మారింది. ఈ విషయం పైన నెటిజన్స్ సైతం భాయ్ బాబీ ఎక్కడ? విడాకులు నిజమేనా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2004లో వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి వివాహం చేసుకున్నారు.వీరికి ఇద్దరు కుమారులు అందులో 2007లో ఆర్య వీర్,2010 లో వేదాంత్ సెహ్వాగ్ జన్మించారు. ప్రస్తుతం వీరిద్దరూ ఢిల్లీ తరపున ఏజ్ క్రికెట్ ఆడుతున్నారు.


20 ఏళ్ల పాటు సాఫీగా సాగిన వీరి వైవాహిక జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించినట్లు వార్తలు వినిపించాయి. సెహ్వాగ్  స్నేహితుడైన ఒక వ్యక్తితో ఆర్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ విషయం తెలిసే ఆర్తిను సెహ్వాగ్ దూరం పెట్టారనే విధంగా వార్తలు వినిపించాయి. అయితే ఆ వ్యక్తి బీసీసీఐలో కూడా ఒక కీలకమైన పదవిలో ఉన్నారని అతనితో ఆర్తి రిలేషన్లో ఉందనే ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలను ఎవరు కూడా అధికారికంగా ధ్రువీకరించలేదు. చివరిసారిగా 2023 ఏప్రిల్ 28న ఆర్తి ఆహ్లావత్ తో వీరేంద్ర సెహ్వాగ్ కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. గత ఏడాది దీపావళి సందర్భంగా కూడా ఆమె తల్లితోనే ఫోటోలను షేర్ చేసుకున్నారు. అప్పటినుంచి సెహ్వాగ్, ఆర్తి విడిపోయారని వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: