
అంతేకాకుండా, జిల్లాల్లో కూటమి నేతల మధ్య తలెత్తిన విభేదాలను సైతం మంత్రులు పరిష్కరించలేకపోతున్నారన్న అభిప్రాయం చంద్రబాబులో బలంగా ఉంది. పాజిటివ్ వేవ్స్ ఉన్నా ఫెయిలే! .. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి కేంద్రం సహకారం, పెట్టుబడుల రాక, అనేక సంక్షేమ పథకాల అమలుతో పాజిటివ్ వేవ్స్ ఉన్నాయని చంద్రబాబు నమ్ముతున్నారు. నిధుల కొరత ఉన్నప్పటికీ, హామీ ఇచ్చిన విధంగా లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. కానీ, మంత్రులు ఈ విజయాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారు. జిల్లాలను పర్యటించి, కూటమి నేతల మధ్య విభేదాలను పరిష్కరించడంలో వారు వైఫల్యం చెందడంతో, మంత్రివర్గంలో ప్రక్షాళన తప్పదని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
వార్నింగ్‌లు దాటి.. ఎన్నికల టీం రెడీ! .. ఇప్పటికే పలు మంత్రివర్గ సమావేశాల్లో చంద్రబాబు మంత్రులను హెచ్చరించారు. పనితీరు ఆధారంగా మార్కులు కూడా ఇచ్చారు. అయినా కొందరిలో మార్పు రాకపోవడంతో, ఇక సమయం చాలదని, ఎన్నికల టీంను సిద్ధం చేసుకోవాలని ఆయన నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఒక పోస్టు ఖాళీగా ఉంది. జనసేనకు చెందిన ముగ్గురు, బీజేపీకి చెందిన ఒక మంత్రి ఉన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్నా, పెద్దయెత్తున ప్రక్షాళన చేయాలని చంద్రబాబు సిద్ధమయ్యారు. రాబోయే ఎన్నికల కోసం పార్టీని పటిష్టం చేసే లక్ష్యంతో, ఈసారి సీనియర్లకు అవకాశం కల్పించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. దీంతో, ప్రస్తుతం పదవుల్లో ఉన్న మంత్రుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఎవరు ఉంటారు? ఎవరికి ఊస్టింగ్? అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతోందనేది త్వరలోనే తేలనుంది.