ఎన్నికల వ్యూహ కర్త, ప్రముఖ రాజకీయవేత్తగా పేరు సంపాదించిన జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆర్జెడి నేత తేజస్విని యాదవ్ నేతృత్వంలో మహాఘట్ బంధన్ ఈ ఎన్నికలలో ఓడిపోయి మూడో స్థానంలో ఉంటుందంటూ మాట్లాడారు. తాము ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని సందర్శించామని ఆయా ప్రాంతాలలో మహాకూటమి కచ్చితంగా మూడవ స్థానంలో ఉంటుందంటు తెలియజేశారు. బీహార్ ఎన్నికలలో ఈసారి ప్రధాన పోటీ ఎన్డీఏ, జన్ సురాజ్ పార్టీ మధ్య ఉంటుందంటూ తెలియజేశారు.


గత ఐదు రోజులలోనే తేజస్వి యాదవ్ చేసిన ప్రకటనలు అసలు అర్థం లేదని, ప్రజలు ఎవరూ కూడా ఆసక్తి చూపడం లేదంటు తెలియజేశారు. అలాగే మధుబని ఎన్నికల ర్యాలీలో భాగంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ బీహార్ ఓటర్లు నితీష్ కుమార్, లాలు యాదవ్, బిజెపి ఆధిపత్య పార్టీల రాజకీయాలను దాటి ముందుకు మాట్లాడారు. రాష్ట్ర యువతపై తటస్థ ప్రయత్నాన్ని ఎంచుకున్నారని బీహార్లో కొత్త రాజకీయ చరిత్రను అందరూ చూస్తూ ఉన్నారని.. లాలు, నితీష్, బిజెపి పార్టీలకు భయపడి ఓట్లు వేసిన 30 ఏళ్ల యుగం అంతం కాబోతోందని తెలియజేశారు.ఎన్డీఏ, తమ జన్ సురాజ్ పార్టీల మధ్య పోటీ ఉంటుందని మహాకూటమి ఓడిపోయి మూడవ స్థానంలో ఉంటుందంటూ  జోష్యం తెలిపారు.


వీటితో పాటు ఒక కొత్త ప్రయత్నం ఉద్భవిస్తుందని.. ఆ నేత ఏ నాయకుడు కుటుంబానికి లేదా కులానికి చెందినవారు కాదంటూ తెలిపారు. కేవలం బీహార్ ప్రాంతానికి చెందిన వారంటూ ప్రశాంత్ కిషోర్ తెలిపారు . జన్ సురాజ్ పార్టీ అధికారంలోకి వస్తే జీవన ఉపాధి కోసం ఎవరు రాష్ట్రాన్ని విడిచి వెళ్లాల్సిన పని లేదంటూ మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీహార్లో ఒక్కసారిగా రాజకీయ వేడి నెలకొంది. వచ్చే నెల 11వ తేదీన ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల దృష్టి ఆయా పార్టీలు ప్రత్యేకించి మరి అక్కడ ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎన్డిఏ, మహాకూటమి పైన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: