ఈ రోజున శ్రీకాకుళం పలాస జిల్లా కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కి సలాటలో భాగంగా ఏకంగా 12 మంది మృతి చెందారు. ఈ ఘటన పైన ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతోపాటు మంత్రులు కూడా స్పందిస్తున్నారు. ఏకాదశినాడు సంతోషంగా స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళిన భక్తులకు సైతం ఇదే చివరి రోజు అవుతుందని ఎవరు ఊహించలేదు. అయితే ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ భక్తులు తెలియజేస్తున్నారు. మరి ఈ కాశి బుగ్గ వెంకటేశ్వర స్వామి యొక్క గుడి గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.


12 ఎకరాలలో తిరుమల ప్రతిరూపంగా నిర్మించిన ఈ ఆలయం ఒక భక్తుడు బాధ నుంచి పుట్టిందట. వెంకటేశ్వర స్వామి పైన ఉండే అపారమైన భక్తి  వల్ల ఒకరోజు తిరుమలకు దర్శనం కోసం వెళ్లగా రద్దీలో ఆ స్వామి కృప లభించలేదు. దీంతో ఆ భక్తుడు మనసు చెల్లించిపోయి ఆ బాధలో నుంచి పుట్టిన ఆలోచన ఈ పలాస కాశిబుగ్గ వెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి కారణమయ్యింది. పలాస కు చెందిన హరి ముకుందా పండా అనే వ్యక్తి 10 సంవత్సరాల క్రితం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లారు.


తిరుపతిలో  ఆ దర్శనం చేసుకునే సమయంలో భక్తులు ఎక్కువగా రావడంతో అతనిని తోసేశారు. దీంతో హరి ముఖందా చాలా బాధపడి కనులారా  చూడలేకపోయానని  ఏకంగా తన సొంత వ్యవసాయ క్షేత్రంలోనే తిరుమలను పోలిన ఆలయాన్ని నిర్మించుకున్నారు. తనకు ఉన్న 100 ఎకరాల పొలంలో 12 ఎకరాల స్థలాన్ని స్వామివారి ఆలయానికి కేటాయించడం గమనార్హం. ప్రతి ఒక్కరికి కూడా దైవదర్శనం కావాలనే సంకల్పంతోనే తన సొంత డబ్బులతోనే తిరుమల ఆనంద నిలయాన్ని పోలినటువంటి ఆలయాన్ని నిర్మించారు. అంతేకాకుండా అక్కడ శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఏకశిలా విగ్రహాలను కూడా ప్రతిష్టించడం జరిగింది. ఆ దేవాలయమే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం.


అచ్చం తిరుమలలో ఉన్న దేవాలయం మాత్రమే 12 అడుగుల వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్టించారు. ఈ గుడిని నిర్మించడానికి హరి ముకుందా పండా ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి తీసుకోలేదు. సుమారుగా 10 సంవత్సరాల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టగా ఏడాది క్రితం ఆలయంలో స్వామివారికి పూజలు మొదలయ్యాయి అప్పటినుంచి ఎక్కువగా భక్తులు రాక మొదలయ్యింది. ఈరోజు తొలి ఏకాదశి కావడం చేత ఆలయం లోకి వేల మంది భక్తులు పోటెత్తారు రద్దీ పెరగడంతో క్యూలైన్ల వద్ద ఉన్న రేయిలింగ్ ఓడిపోయి భక్తులు కింద పడిపోవడం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: