జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది. ఎవరు గెలిచినా కొద్దిపాటి మెజారిటీతోనే గెలుస్తారు. అలాంటి ఈ తరుణంలో జూబ్లీహిల్స్ లో  ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు  అన్ని పార్టీల బడా నాయకులంతా దిగి రాత్రి పగలు అనే తేడా లేకుండా  ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే డైలాగుల వార్ కూడా నడుస్తోంది. బీఆర్ఎస్ తరఫున కేటీఆర్,హరీష్ రావు ఇతర ముఖ్య నేతలు ప్రచారంలో ఉంటే కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు  ఇతర మంత్రులు వచ్చి ప్రచారాలను నిర్వహిస్తున్నారు. బీజేపీ తరఫున కేంద్రమంత్రులు,ఎమ్మెల్యేలు కూడా ప్రచారం నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా ఎవరికి వారే గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ఇక ఈ ప్రచారం ఇలా నడుస్తున్న సమయంలో నేతలు సినిమా డైలాగులతో పాటు పలు చమత్కారాలు పేలుస్తూ హైలైట్ అవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఉపఎన్నిక గెలుపు అనేది రెండు పార్టీలకు జీవన్మరణ పోరాటంలా మారింది. ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే ఇక తెలంగాణలో తిరుగు ఉండదు అనే నినాదంతో వారు ముందుకు వెళ్తారు. కాంగ్రెస్ గెలిస్తే ఇక మాకు అడ్డు లేదు బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మడం లేదనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తారు. అందుకే రెండు పార్టీలు ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. ఇలా ప్రచారం సాగుతున్న సమయంలో జూబ్లీహిల్స్ లోని రహమత్ నగర్ లో కేటీఆర్ రోడ్ షో లో ఒక కార్యకర్త ఆసక్తికరమైన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. మహేష్ బాబు డైలాగులతో కూడిన ఓ ఫ్లెక్సీ ని ఏర్పాటు చేసి అందులో ఓ వైపు కేటీఆర్ ను మరోవైపు మహేష్ బాబు ఫోటోను  ఉంచారు.

ఆ ఫ్లెక్సీ కింద "దస్ దీన్ కే బాద్ .. ఇదిరీ మిలేంగే .. జెండా పాతేంగి" అంటూ బిజినెస్ మాన్ చిత్రంలోని డైలాగును ప్లెక్సీ పై రాసుకోచ్చారు.. పది రోజుల్లో ఇక్కడే కలుద్దాం తమ బీఆర్ఎస్ పార్టీ జండా ఎగరేద్దాం అని అర్థం వచ్చేలా ఆ ఫ్లెక్సీ ని పెట్టారు .. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో, బీఆర్ఎస్ అభిమానులు కామెంట్లతో ముంచేస్తున్నారు. ఇక మహేష్ బాబు డైలాగ్ పెట్టడానికి ప్రధాన కారణం ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ డైలాగ్ కరెక్ట్ గా సెట్ అవ్వడంతో పాటు మహేష్ బాబు కేటీఆర్ మంచి ఫ్రెండ్స్ కాబట్టి అలా మహేష్ బాబు డైలాగ్ తో ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: