నిరుద్యోగులకు శుభవార్త. భారతీయ రైల్వే వేలసంఖ్యలో ఉద్యోగాలు ప్రకటించింది. ప్రపంచంలోనే భారీ స్థాయిలో ఉద్యోగుల రిక్రూట్ మెంట్ కు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. పెద్ద సంఖ్యలో అసిస్టెంట్ లోకో పైలట్, ఫిట్టర్, డ్రైవర్,బ్లాక్ స్మిత్, కార్పెంటర్ వంటి టెక్నిషియన్ పోస్టుల భర్తీకి సిద్దమవుతోంది. దాదాపు  90 వేల ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Image result for railway recruitment

గ్రూప్-సీ, గ్రూప్ -డి ఉద్యోగాల భర్తీకి రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ సి, గ్రూప్ డి విభాగంలోని అసిస్టెంట్ లోకో పైలట్, ఫిట్టర్, క్రేన్ డ్రైవర్, బ్లాక్ స్మిత్, కార్పేంటర్, ట్రాక్ మెయింటైనర్, పాయింట్స్ మెన్, హెల్పర్, గేట్ మెన్, పోర్టర్ వంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు 89409 ఖాళీలను భర్తీ చేయనుంది. గ్రూప్ -సీ లెవల్ 2 పోస్టు కు నెలసరి జీతం స్కేల్ 19900 నుంచి 63200 వరకు ఉంటుంది.


గ్రూప్ సీ లెవల్ -1 పోస్టులకు 18000 నుంచి 56900 వరకు ఉంటుంది. గ్రూప్ సీ లెవల్ -2 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు మార్చి 5, 2018 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంది. గ్రూప్ సీ - లెవల్ -1 పోస్టులకు మార్చి -12, 2018లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. గ్రూప్ - సీ లెవల్ 2 పోస్టులకు 18 ఏళ్లకు తగ్గకుండా, 28 ఏళ్లకు మించకుండా ఉండాలని రైల్వేరిక్రూట్ మెంట్ బోర్టు నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ పోస్టులకు విద్యార్హత పదో తరగతి పాసై ఉండి,ఐటీఐ లేదా ఇంజనీరింగ్ డిప్లమా లేదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అర్హులుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.


గ్రూప్ -సీ లెవల్ 1 పోస్టులకు 18 ఏళ్లకు తగ్గకుండా 31 ఏళ్లకు మించకుండా ఉన్న అభ్యర్థులు అర్హులు. ఈ పోస్టులకు పదవతరగతి పాస్ అవడంతో పాటు ఐటీఐ చేసిన అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోదాదాపు పది వేల పోస్టుల భర్తీకి కానున్నాయి. రైల్వే రిక్రూట్ మెంట్ గ్రూప్ సీ లెవల్ 2 కు దరఖాస్తుల చివరి తేదీ మార్చి 5వ తేదీ. కంప్యూటర్ బేస్ట్ ఆప్టిట్యూడ్ పరీక్ష ఏప్రిల్- మే నెలలో ఉండే అవకాశం ఉందని రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు అధికారులు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: