భగవంతుడు ఎదుట కనిపించాలి అంటే ఎలా సాధ్యమవుతుంది. మన మనసును భగవంతుడిపై ఏకీకృతం చేయాలి. అందుకే దేవాలయాలను ఏర్పాటు చేసి, అక్కడున్న వాతావరణం కూడా దేవాలయాలకు వచ్చే భక్తులను ఆనందోత్సాహాల కు గురి చేస్తూ ఉంటుంది. ఇక ఎప్పుడైతే దేవాలయాలకు భక్తులు వెళ్తారో, అప్పుడు వారి మనసు మొత్తం దేవుడిపైనే నిమగ్నం అవుతుంది. ఎంత ఒత్తిడి ఉన్న వాళ్లు కూడా దేవాలయాలకు వెళ్లగానే వారి మనసులో ప్రశాంతతను నింపు కుంటారు. అందుకోసమే దేవాలయాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.