కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఇక కౌరవుల వైపు ఉండడం కోసం దుర్యోధనుడు బలరాముడిని కోరగా,అప్పుడు బలరాముడు భీముడికి దుర్యోధనుడికి ఇద్దరికీ నేను గధ విద్య నేర్పించాను. మీరిద్దరూ నాకు ఆప్తమిత్రులు. నేను ఎవరి పక్క ఉండలేను. శ్రీకృష్ణుడు ఎటువైపు ఉంటే అటువైపు ధర్మం ఉంటుందని, నేను ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేను అని, శ్రీ కృష్ణుడికి విరుద్ధంగా యుద్ధం చేయలేనని దుర్యోధనుడికి బలరాముడు చెప్పి, ఆ యుద్ధానికి దూరంగా ఉంటాడు.