2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి సంబంధించి మినీ వేలం డిసెంబర్ 23వ తేదీన జరగబోతుంది అన్న ప్రకటన వచ్చిన వాటి నుంచి కూడా ఇక ఇందుకు సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎవరు చోటు సంపాదించుకుంటారు అన్న విషయంపై కూడా అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఆస్ట్రేలియా జట్టు తరఫునుంచి అద్భుతంగా రాణిస్తున్న కామెరున్ గ్రీన్ ఇక ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇక అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ ఇక తన బ్యాటింగ్ తో ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్న కామెరూన్ గ్రీన్ కి భారీ ధర పలకడం ఖాయమని ఎంతోమంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు అని చెప్పాలి. ఇక అతన్ని సొంతం చేసుకునేందుకు ఎన్నో ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశం ఉంది అని అంచనా వేసారు. అంతే కాదు కామరూన్ గ్రీన్ అటు ఐపిఎల్ లో తన పేరును దరఖాస్తు చేసుకోవడంపై ఇక కోచింగ్ సిబ్బంది సహచర ఆటగాళ్లు సైతం తీవ్ర స్థాయిలో చర్చించుకున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఎంతోమంది మాజీ ఆటగాళ్లు ఊహించినట్లుగానే అటు కామరూన్ గ్రీన్ కి ఐపీఎల్ మినీ వేలంలో భారీ ధర తగ్గింది అని చెప్పాలి. ఏకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ కామరూమ్ గ్రీన్ ని 17.50 కోట్లకు దక్కించుకుంది. అయితే అతని కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ మధ్య తీవ్రస్థాయిలో పోటీ జరిగింది అని చెప్పాలి.  దీంతో అతని దక్కించుకునేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరిచిన ముంబై ఇండియన్స్ జట్టు 17.5 కోట్ల భారీ ధర వచ్చింది మరి కొనుగోలు చేసింది అని చెప్పాలి. ఇక అతని ఐపిఎల్ ప్రస్తానం ఎలా సాగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl