రాజకీయాల్లో ఉన్నత శిఖరానికి వెళ్లాలనుకునే వారు ఎవరైనా, ఎప్పటికప్పుడు రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ , అన్ని విషయాల్లోనూ పై సాధించే విధంగా వ్యవహరిస్తూ,  రాజకీయ ప్రత్యర్థుల పై విరుచుకుపడుతూ, వీరావేశంతో రాజకీయ పలుకుబడి పెంచుకోవాల్సి ఉన్నా, ఇంకా విశ్రాంతి రాజకీయాలకే  పాల్పడుతూ , సొంత పార్టీ నేతలకు విసుగు వచ్చే విధంగా ప్రవర్తిస్తున్న చినబాబు రాజకీయ వ్యవహారంపై పార్టీలోనూ,  ప్రజల్లోనూ తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రస్తుతానికి పార్టీని చంద్రబాబు తన శక్తి మేరకు నెట్టుకొస్తున్నారు. పార్టీ శ్రేణులలో భయాందోళనలు తొలగించే విధంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. 




అన్ని తానై చక్కబెడుతూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చంద్రబాబు చేసుకుంటూ వస్తున్నాడు. ఇటీవలే పార్టీలో కొత్త కమిటీలను ఏర్పాటు చేసి చినబాబు కి నొప్పి లేకుండా చేశారు. ఈ సమయంలో రాజకీయ ఎత్తు గడలు వేస్తూ లోకేష్ అన్ని విషయాలలో పై  సాధిస్తారని ఎంతగా ఆశపడుతున్నారు. అయినా ఇంటికే  పరిమితం అవుతున్నారు. ఇల్లు వదిలేందుకు .... కాలు కలిపేందుకు.... ఏపీలో అడుగు పెట్టేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు పోనీ కరోనా భయం ఏమైనా పట్టుకుందా అంటే ప్రస్తుతం అక్కడ ,ఇక్కడ అంతా మామూలు అయిపోయింది. 





70ఏళ్ల వయసులో చంద్రబాబు సైతం రోడ్డెక్కి ఏదో ఒకటి చేస్తూ ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు . చిన బాబు ఇల్లు వదిలి బయటకు మాత్రం రావడం లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో చిన బాబు ఎప్పుడూ సక్సెస్ కాలేదు ఎమ్మెల్సీగా మంత్రిగా పనిచేశారు ఎన్నికల్లో గెలుపొందింది లేదు 2019 సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అక్కడి ప్రజలు దీంతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ పోస్తున్నారు 2024 నాటికైనా చిన్న బాబు గెలిచే అవకాశం నియోజకవర్గం ఏమైనా దొరుకుతుందా అంటే అది సందేహంగానే ఉంది ఈ పరిస్థితుల్లో చిన్న బాబు పార్టీ ఎలా నెట్టుకొస్తున్నారు ? తండ్రి రాజకీయ వారసత్వం నిలబెడతారా అనే సందేహం ఆ పార్టీ నేతల్లో నెలకొంది. 



ఆ విధంగా ఆందోళన చెందుతున్నా, చిన బాబు మాత్రం తన రాజకీయం విశ్రాంతి రాజకీయమే అన్నట్లు గా వ్యవహరిస్తూ సోషల్ మీడియా కు మాత్రమే పరిమితం అయిపోవడం చూస్తుంటే ఇక చిన బాబు తో రాజకీయం కష్టమైన పనే అన్నట్టుగా మారిపోయింది. అయ్యో పాపం అని టిడిపి శ్రేణులు అనుకోవాల్సి న పరిస్థితి వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: