ముఖ్యంగా కొందరి మంత్రుల విధానము, వారు ప్రజల్లో ఉన్నప్పుడు చేసే కామెంట్స్ జగనోరు కి.. తీవ్ర తలనొప్పి గా మారాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే వైసీపీ నాయకులు మాట్లాడే మాటల పై సోషల్ మీడియాలో అనేక విధమైన ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ వైసీపీ నాయకులలో ఎలాంటి మార్పు రావడంలేదు. వారు ప్రజల్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలని తెలుసుకోకుండా ఇష్టానుసారంగా తమ నోటికి పని చెబుతూ ఎప్పుడూ చర్చల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలను ఎదుర్కొనే సందర్భంలో సహనం కోల్పోయి బూతు పురాణాలు వల్లిస్తున్నారు.
ప్రతిపక్షాల నుండి వచ్చే విమర్శలను సలహాలు గా తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపవలసిన మంత్రులు బూతులు వల్లించడం సరైన ఈ విధానం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి జగనోరు ఆ మంత్రులపై చర్యలు తీసుకోకపోతే తన ప్రభుత్వానికి కాక పార్టీ కూడా చాలా నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికే కొందరి మంత్రులపై ప్రజలు తీవ్ర అసహనంగా ఉన్నారనేది కాదనలేని వాస్తవం. ఏది ఏమైనప్పటికీ మరి ఆ మంత్రులు తమ వైఖరి మార్చుకున్నారు లేక అలాగే కొనసాగుతారా అన్నది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి