ఎంతటి వాళ్ళనయినా సరే అవసరం తీరిపోయిన తర్వాత కరివేపాకు లాగ చంద్రబాబునాయుడు తీసి అవతల పారేస్తాడని పార్టీలో ఎప్పటి నుండో టాక్ నడుస్తోంది. ఇందుకు ఉదాహరణలు కూడా చాలానే చూపిస్తుంటారు నేతలు. ఏ నేతతో అయినా పనుంటుందని అనుకుంటే చాలు అమాంతం సదరు నేత స్ధాయితో పనిలేకుండా ఆకాశానికి ఎత్తేస్తారు. అవసరం తీరిపోయిందంటే ఇక ఆ నేత ముఖం కూడా చూడటానికి ఇష్టపడరని నేతలు చెప్పుకోవటం అందరికీ తెలిసిందే. ఇదంతా ఇపుడు ఎందుకంటే మాజీమంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారం పార్టీలో ఇపుడు హాట్ టాపిక్ గా మారింది కాబట్టే. హైదరాబాద్ లోని బోయినపల్లిలో ముగ్గురు సోదరుల కిడ్నాప్ ఘటన రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.




కిడ్నాప్ ఘటనలో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్, సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డి, అత్తమామలతో పాటు మరో 15 మంది నిందితులుగా పోలీసలు కేసులు నమోదు చేశారు. ముందుగా అఖిలను పోలీసులు అరెస్టు చేశారు. భర్త, సోదరుడు, అత్తమామలు మాత్రం ఇంకా పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నారు. సరే ఈ కేసు గురించి లోతుపాతులు అవసరం లేదు. అయితే అఖిలను రిమాండ్ లో ఉన్న సమయంలో సాయం చేయమని ఆమె కుటుంబసభ్యులు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారట. అయితే వాళ్ళని కలవటానికి చంద్రబాబు ఇష్టపడలేదని సమాచారం.




సరే లాయర్ల ద్వారా బెయిల్ అప్లికేషన్ పెట్టుకుని తర్వాతెప్పుడో అఖిల బెయిల్ తెచ్చుకుని రిలీజ్ అయ్యారు. జైలు నుండి బయటకు వచ్చిన వెంటనే చంద్రబాబును కలవటానికి అఖిల చేసిన ప్రయత్నాలే సానుకూలం కాలేదట. ఎన్నిసార్లు అపాయిట్మెంట్ అడిగినా అటువైపు నుండి నో అనే సమాధానం వస్తోందట. పోనీ ఫోన్లో అన్నా మాట్లాడుదామని ప్రయత్నిస్తే దానికి కూడా అవకాశం రాలేదట. నేరుగా ఇంటికే వెళిపోదామని అనుకున్నా తీరా వెళ్ళిన తర్వాత కలవకపోతే అదో అవమానం. అందుకనే చేసిన ప్రయత్నాలు ఫెయిలవ్వటంతో విసిగిపోయిన మాజీమంత్రి కూడా ప్రయత్నాలు మానుకున్నట్లు సమాచారం.  చంద్రబాబు వరసచూస్తుంటే ఇప్పుడిప్పుడే అఖిలను కలవటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదని అర్ధమైపోతోంది. ఎందుకంటే అఖిలతో చంద్రబాబుకు ఏమీ అవసరం లేదు కాబట్టే. మళ్ళీ భవిష్యత్తులో ఏమన్నా అవసరం ఉంటుందనుకుంటే అప్పుడు ఆయనే మాజీమంత్రిని వెతుక్కుంటూ వెళతారనటంలో ఎవరికైనా డౌటా ?




మరింత సమాచారం తెలుసుకోండి: