మూలిగే నక్క మీద తాటిపండు పడడం అంటే ఇదేనేమో.. ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీకి అనుకూలంగా వార్తలు రాయడం, మరో పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ప్రభుత్వాలను నిలబెట్టాలన్నా.. వాటిని కూలదోయాలన్నా ఆయనతో సాధ్యం అవుతుంది. అయితే న్యూస్ క్లిక్ అనే సంస్థకు చైనా నుంచి నిధులు వచ్చినట్లు కేంద్ర నిఘా వర్గాలు తెలపడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేస్తున్నాయి. వీరికి చైనా నుంచి రూ.30 నుంచి 40 కోట్లు వచ్చినట్లు సమాచారం.


న్యూస్ క్లిక్ అనే సంస్థ చైనా ప్రాక్సీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం అంటే వ్యతిరేక వార్తలు రాస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే విధంగా వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. దీన్ని గమనించిన కేంద్రం దర్యాప్తు సంస్థలు 40 మంది జర్నలిస్టుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించింది. ముఖ్యంగా నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి. ఎవరూ ఈ ఫ్లాన్ చేయమన్నారు. తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇంతకుముందు ఒక సారి రైడ్స్ అయ్యాయి. ప్రస్తుతం కూడా రైడ్స్ అయ్యాయి. సీనియర్ కమ్యూనిస్టు నాయకుడి ఇంట్లో కూడా సోదాలు అయ్యాయి. అయితే ఆకస్మాత్తుగా ఆ సీనియర్ నాయకుడి ఫోన్ నుంచి హైదరాబాద్ లో అతి పెద్ద మీడియా నాయకుడికి ఫోన్లు వచ్చాయి. దీంతో దర్యాప్తు అధికారులు విస్తుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు కమ్యూనిస్టులకు, ఆ మీడియా అధిపతికి ఏంటి సంబంధం అనే విధానంలో దర్యాప్తు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


రాబోయే ఎన్నికల్లో మళ్లీ కేంద్రలో బీజేపీ, రాష్ట్రంలోో వైసీపీ సర్కారు వస్తే పెను మార్పులు ఉంటాయనేది మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఎవరూ ఆ మీడియా అధిపతి.. ఏం కుట్ర చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారనే వివరాలు కేంద్ర దర్యాప్తులో తేలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: