ఇష్టం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన చరణ్ రెడ్డి, ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో,అక్కినేని వారమ్మాయి సుప్రియను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. దాంతో ఇండస్ట్రీలో అక్కినేని అల్లుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతలా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో చరణ్ రెడ్డి 2012లో ఉన్నట్లుండి మరణించాడు. కేవలం 37 ఏళ్ల వయసులోనే ఈయన చనిపోవడం అందరి మనసులను కలచివేసింది. ఇక చరణ్ మరణం అప్పట్లో ఒక సంచలనం రేపింది.నిజానికి ఈయన చనిపోయే నాటికి సుప్రియతో సంసారం కూడా అంత బాగా లేదని, తరచూ వీరిద్దరి మధ్య గొడవలు జరిగేవని, ఇక అంతే కాకుండా ఆమెతో విడాకులు తీసుకోవడానికి కూడా సిద్ధమయ్యాడని ప్రచారం జరిగింది. అయితే సుప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, ఆమె మీద మనసు చంపుకోలేక, అనారోగ్యం పాలయ్యాడు అని చరణ్ రెడ్డి సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఉన్నట్లుండి ఓ రోజు హఠాత్తుగా గుండెపోటు రావడం, అపోలో హాస్పిటల్కు తీసుకెళ్లినా అప్పటికే ప్రాణాలు పోవడం జరిగిపోయాయి.