అప్పట్లో మన తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ , నాగేశ్వర రావు ల హవాల కొనసాగుతున్న సమయంలో, అప్పుడే శోభన్ బాబు లాంటి కొత్త హీరోలు వచ్చి సినీ ఇండస్ట్రీని ఒక షేక్ చేస్తున్నారు. అలాంటి సమయంలో మరొక కొత్త నటుడు వచ్చి , ఆ స్థానాన్ని పడగొట్టడం అంత సులభమైన పనేమీ కాదు .అది  చాలా కష్టంతో కూడుకున్నది. కానీ మన చలం గారు ఎంతో తెలివితో ఒక సరికొత్త మార్గాన్ని ఎంచుకుని, తనకంటూ ఒక స్థానాన్ని పదిలం చేసుకున్నారు.

ఈయన అప్పట్లో నటించిన తీరుకు విలక్షణ నటుడు అని కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఎప్పుడు చూసినా చాలా హుషారుగా కనిపిస్తూ వుండే పాత్రలు చేయడం మరో విశేషం. ఇక తన సహజమైన నటనతో అన్ని పాత్రలకు ప్రాణం పోస్తూ, ఆ కథలను ప్రేక్షకుల దగ్గరకు బాగా చేరవేసిన విలక్షణ నటుడు. ఈయన వరుసగా సినిమాలలో చాలా చక్కగా నటించి, ప్రేక్షకులకు మరింత దగ్గర కావడంతో పాటు వారి మదిలో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.


సాధారణంగా ఒక హీరో కానీ ఒక విలన్ కానీ ప్రేక్షకులకు బాగా దగ్గరవ్వాలంటే మాత్రం తను ఎంచుకున్న కథ కథనాల పై ఆధారపడి ఉంటుం.ది ఇక అందులో ముఖ్యంగా కథాకథనాలని ఎంచుకోవడంలో చలం గారికి  ఎవరూ సాటిరారు. ఆయన ఎంచుకునే కథలు భిన్నంగా ఉండటంతో పాటు ప్రేక్షకుల దగ్గర ఆయన్ని ఒక మంచి నటుడిగా నిలబెట్టాయి. ఇక అలాంటి పాత్రలు ఎంచుకోవడంతో చలం గారికి ప్రేక్షకులు బాగా దగ్గరయ్యారు.. ముఖ్యంగా ఈయన ఎంచుకున్న  పాత్ర ఏమిటంటే, ఒక హీరోగా కాదు ఒక విలన్ గా కూడా కాదు అంతకు మించి అనే లాగా, అప్పట్లో ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో అలాంటి పెద్దలపై తను  తిరుగుబాటు చేసే పాత్రలవి. ఇక ఈయన కథలు ఇలా సాగడంతో మాస్ ఆడియన్స్ నుంచి చలం గారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి.

ఈయన సినిమా వస్తోందంటే చాలు ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్  కొట్టాల్సిందే. సాధారణంగా ఈయన సినీ ఇండస్ట్రీ పై ఎంత శ్రద్ధ పెట్టారో ఆయన జీవితంలో మాత్రం శ్రద్ధ పెట్టలేకపోయారు. ముఖ్యంగా ఈయన ఒక నటుడిగా , నిర్మాతగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. తను నిర్మించిన ఎన్నో సినిమాలు డిజాస్టర్ కావడంతో ఆర్థికంగా, వైవాహిక ఒడిదుడుకులు ఏర్పడి మానసికంగా కుంగిపోయి, మద్యం అలవాటుకు బానిస అయ్యారు. ఇక ఆరోగ్యం దెబ్బతినడంతో ఎవరూ ఊహించని స్థాయిలో ఆయన మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: