
AVS తెలుగు దినపత్రికలో జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించారు. అతను తన సినిమాల్లో ఒకదానిలో 'తుత్తి' (నత్తిగా మాట్లాడేవాడు) గా పాపులర్ అయ్యాడు. 1993లో బాపు దర్శకత్వం వహించిన తన మొదటి చిత్రం 'మిస్టర్ పెళ్లాం'తో avs ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును కైవసం చేసుకున్నాడు. అనేక చిత్రాలలో తన చేష్టల ద్వారా ప్రేక్షకులను తనదైన శైలిలో కితకితలు పెట్టిన ఏవీఎస్ తిరుగులేని కమెడియన్ గా తెలుగు చిత్రపరిశ్రమలో అవతరించాడు. తన కామిక్ టైమింగ్, ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో మరింత ప్రత్యేకంగా నిలిచిన avs విలన్ పాత్రలతో సహా అనేక పాత్రలను పోషించాడు. 20 ఏళ్ల కెరీర్‌లో ఈ నటుడు 500 చిత్రాలకు పైగా నటించారు.
ఏవీఎస్ పలు హిట్ చిత్రాల్లో నటించారు. 'పవిత్ర' , 'దేనికైనా రెడీ', 'ఝుమ్మంది నాదం', 'బెండు అప్పారావు RMP', 'కింగ్', 'శ్రీరామదాసు', 'శివమణి', 'గంగోత్రి', 'ఇంద్ర', 'చిత్రం', 'శ్రీరాములయ్య', 'సమరసింహా రెడ్డి', 'అన్నమయ్య', 'సిసింద్రీ', మరియు 'యమలీల' ఇంకా చాలా ఉన్నాయి. 'సూపర్ హీరోస్', 'కోతిమూక' వంటి కొన్ని చిత్రాలకు కూడా ఏవీఎస్ దర్శకత్వం వహించారు. అయితే ఆయన నటించి, నిర్మించిన 'అంకుల్', 'ఓరి నీ ప్రేమ బంగారం కాను' బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో నిర్మాతగా సక్సెస్ రుచి చూడలేదు.
AVS మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)లో క్రియాశీల సభ్యుడు.
అయితే కాలేయ వ్యాధి కారణంగా ఆయన విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. ఏవీఎస్ కాలేయ మార్పిడి చేయించుకున్నప్పుడు అతని కుమార్తె దాతగా మారింది. ఆ తరువాత ఆయన కోలుకున్నాడని అనుకునేలోపే ఏవీఎస్ ను కిడ్నీ ఫెయిల్యూర్ కబళించేసింది. 56 ఏళ్ల వయసులో ఉన్న మరో ఆణిముత్యాన్ని టాలీవుడ్ కోల్పోయింది.