టాలీవూడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ దిగ్గజ నటుడిగా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సాంఘిక ,పౌరాణిక, జానపద ఇలా ఎన్నో చిత్రాలలో నటించి తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎంతో మంది నటులకు ఆయన ఆదర్శంగా నిలిచాడు. అయితే నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారో.. రాజకీయ నాయకుడిగా అంతే గుర్తింపు తెచ్చుకున్నారు. అంతటి ఘనతను సాధించిన ఎన్టీఆర్ కి ఓ నటి అంటే వెన్నులో వణుకు వచ్చేదంట.. ఆ నటి ఎవరో ఒక్కసారి చూద్దమా.

ఇక ఆమె ఎవరో కాదు తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ కన్నాంబ. ఆమె  ఒకేసారి రెండు భావాలను కళ్ళలో పండించగలదు. సావిత్రి ఒక్క కంటిలో నుండి కన్నీరు తీసినట్లు.. కన్నాంబ ఒక కంటి నుండి సెంటిమెంట్ మరొక కంటి నుండి కోపాన్ని ప్రదర్శించక గల గొప్ప నటి. అయితే తొలితరం నటిగా దేశంలోనే అద్భుత నటన కనబర్చారు.

అప్పట్లో స్టార్ హీరోలకు సైతం పోటీగా నిలిచింది. ఆమెకి ఆర్థిక ఇబ్బందులు మాత్రం ఆమెను ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉండేవి. అయితే ఒకానొక సమయంలో వినుకొండలో ఓ నాటకం ప్రదర్శించారు. నాటకం పూర్తైన అనంతరం ఓ వ్యక్తి తన దగ్గరికి వచ్చి.. మీ నాటకాలు నేను చూస్తాను. మీరు అద్భుతంగా చేస్తారు. కాగా.. మీరు ఎందుకు అన్ని నాటకాల్లో ఒకే చీరను ధరిస్తారు? అని అడిగారంట. దానికి ఆమె టకాల కోసం కథలు చాలా ఉన్నాయి కానీ.. నాకు కట్టుకోవడానికి ఒక చీర మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది.

అయితే కన్నాంబ 1935లో హరిశ్చంద్ర సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయమైంది. ఆమె నటించిన చివరి సినిమా 964లో వచ్చిన వివాహ బంధం. కన్నాంబ ఎన్నో సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది, ఇక అప్పట్లో కన్నాంబ ముందు నటించేటప్పుడు ఎస్వీయార్, ఎన్టీఆర్ కూడా భయపడుతూ ఉండేవారంట. కన్నాంబ ముందు బాగా నటించకపోతే.. ఎవరూ నిలబడలేమని అనుకునే వారంట. ఆమె తన అద్భుత నటనతో తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో అద్భుత నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: