చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మహాసముందు అనే జిల్లాలో బాగాబాహార అనే గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఒక గుట్టపైన చండీదేవి ఆలయం ఒకటి ప్రసిద్ధిగాంచింది. అక్కడ గుళ్ళో పూజారి శంఖం పూరించిన వెంటనే ఎలుగుబంట్లు వచ్చి అక్కడ భక్తులు పెట్టిన ప్రసాదాలను స్వీకరించి వెళ్తాయట.