ఉదయాన్నే లేచి కల్లాపి జల్లి ముగ్గులు పెడతారు. ఇలా చేయడం వల్ల ఇంటికి, ఒంటికి ఎన్నో లాభాలున్నాయి. అవి ఏంటో చూద్దాం.ఏ ఇంటి ముందైతే ముత్యాల ముగ్గు ముచ్చటగా ఉంటుందో ఆ ఇంట సాక్షాత్తూ లక్ష్మీదేవే కొలువై ఉంటుందంటారు పెద్దలు. పొద్దునే లేచి ఇల్లు వాకిలి ఊడ్చుకుని నీళ్లు జల్లి చక్కగా ముగ్గు వేసి ముగ్గులో పసుపు, కుంకుమ, పువ్వులు వేస్తే ఎంతో చూడ చక్కగా ఉంటుంది కదా అండి.

 

ఆ ఇంటి వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా మారిపోతుంది.. ఒక కొత్త పాజిటివ్ ఎనర్జీ ల అనిపిస్తుంది.. బియ్యంపిండితో ముగ్గులు వేయడం వల్ల.. చీమలకు ఆహారం పెట్టినవారవుతాం.సంక్రాంతి పండుగ రోజు ఆవుపేడతో గొబ్భిళ్లు చేసి పెట్టి.. దాని మీద బంతిపూలు, గుమ్మడిపూలు పెడతాం.. ఆవుపేడవల్ల పాములు, తేళ్లు వంటివి ఇంట్లోకి రాకుండా ఉండడమే కాకుండా..క్రిమికీటకాలను నాశనంచేస్తాయి... పైన వేసే నవధాన్యాలు పిచ్చుకలకు ఆహారం అని అర్థం..పూర్వం ప్రతి మహిళ రోజూ ఇంటిముందు ముగ్గుపెట్టేది..

 

ఒకవేళ ముగ్గు లేకపోతే ఆరోజు ఆమె ఆరోగ్యంబాలేదని, లేకపోతే.. వేరే ఏదైనా సమస్య ఉందని ఇరుగుపొరుగు వారు సాయం చేసేవారట. ముగ్గు వేయాలంటే వంగి వేయాలిసిందే.. వంగి ముగ్గు వేస్తారు కాబట్టి.. ఇందువల్ల మహిళలకు చక్కని వ్యాయామం కూడా అవుతుంది..నడుము కి మంచి వ్యాయామం.. ఇంకా చెప్పాలంటే.. ముగ్గుల్లో వేసే అడ్డగీతలు..

 

ఇంట్లో నుంచి లక్ష్మీ దేవిని బయటకు వెళ్లకుండా చూస్తాయట.మనం వేసే ముగ్గులు కేవలం గీతలు కాదు.. యంత్రాలు కూడా ఉంటాయి.ముగ్గు ప్రాధాన్యం ఎంతుంటుందంటే.. పూర్వకాలంలో సాధువులు, సన్యాసులు ముగ్గులేని ఇంటివారిని బిక్ష కూడా అడిగేవారు కాదట.రంగవల్లులు వేయడం వల్ల ఇంటికి ఎంతో అందం..

 

కాబట్టి ఇప్పటికైనా ముగ్గులు.. ఆర్టీఫీషియల్‌గా ఎప్పటికీ ఉండేలా పెయింట్స్ వేయకుండా ముగ్గులు పెట్టడం ఎంతో మంచిది.విన్నారుగా ముగ్గులు.. వాటి వెనుక నిజాలు.. ఇంకెందుకు ఆలస్యం..మరి మీరూ రంగురంగులతో మీ వాకిట్లను నింపేయండి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: