మనలో చాలా మంది అప్పుడప్పుడు అకస్మాత్తుగా భయపడుతూ ఉంటాం. అందులోనూ ముఖ్యంగా మన సొంత ఇంట్లోనే ఒంటరిగా ఉన్న సమయంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఇంకా కొన్నిసార్లు సడెన్ గా ఏవేవో శబ్దాలు వినిపించడం.. ఎవరో మనల్ని పిలిచినట్టు అనిపించడం.. మనం బయటకు వెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడం వంటివి జరిగితే మనకు చాలా భయమేస్తుంది. కొన్నిసార్లు పిల్లి ఇంట్లోకి మెల్లగా వచ్చినా కూడా సడెన్ గా ఉలిక్కి పడుతూ ఉంటాం. అంతేకాదు అనవసరమైన విషయాలను తలచుకుని తెగ ఆందోళన పడిపోతూ ఉంటాం. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే.. ఇంట్లో ప్రతికూల శక్తులు క్రీయాశీలతల వల్ల కూడా కావొచ్చు.

ఇలాంటి సమయంలో మన ఇంట్లో ఎవరైనా చనిపోతే.. వారి ఆత్మలు తిరుగుతున్నాయని, వాటి వల్లే తమకు ఇలాంటి ఆందోళన పడుతున్నామోనని చాలా మంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో మీ మనసులో ఇలాంటి భయాల నుండి విముక్తి పొందడానికి వాస్తుశాస్త్రం కొన్ని చిట్కాలను చెబుతోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం... మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు భయం కలగకుండా ఉండాలంటే, మీరు మూగజీవాలైన ఆవులు, కుక్కలు, చీమలు, పక్షులకు ఆహారాన్ని అందించాలి. ఇలా వాటికి తినిపించడం ద్వారా పుణ్య ఫలాలు అందుతాయి. హిందూ ధర్మంలో ఆవును పవిత్రంగా, గౌరవాన్ని చిహ్నంగా భావిస్తారు. ఆవులో సకల దేవతలు ఉంటారని విశ్వసిస్తారు. గోదానం అనే సంప్రదాయం పూర్వం నుండి కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆవును ఆరాధించడం ద్వారా లక్ష్మీదేవి కూడా సానుకూలంగా మీపై అనుగ్రహం పెంచుతుంది.

మీ ఇంట్లో ఏమైనా ప్రతికూల శక్తులను తొలగించడానికి మీరు గుర్రపుడెక్క(గుర్రానికి వేసే కళ్లెం)ను ఉపయోగించాలి. ప్రతికూల శక్తులపై గుర్రపుడెక్క చాలా ప్రభావవంతంగా పరిగణిస్తారు. దీన్ని ఇంటి ప్రధాన ద్వారం(తలుపు) ద్వారా ఇంగ్లీష్ లో 'U' ఆకారంలో వేలాడదీయండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులను రానివ్వకుండా కాపాడుతుంది. అంతేకాదు ఇంట్లో సానుకూల శక్తిని లభిస్తుంది. ఇవన్నీ పాటిస్తే మీకు ఎటువంటి భయాలు కలగవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: