బంగ్లాదేశ్ స్టార్ అల్ రౌండర్, టెస్ట్ , టీ 20 కెప్టెన్  షకిబుల్‌ హసన్  చిక్కులో  పడ్డాడు.  గతంలో ఓ బుకీ  షకిబుల్‌ను సంప్రదించగా  దాన్ని అతను  తేలిగ్గా తీసుకున్నాడు.  కనీసం ఈ  సంఘటన పైబంగ్లా క్రికెట్ బోర్డు కు సమాచారం ఇవ్వకుండా లైట్ తీసుకోవడంతో  ఇప్పుడదే  అతని పాలిట శాపంగా మారింది.   తాజాగా   దీనిపై సమాచారం అందుకున్న cricket BOARD' target='_blank' title='బీసీబీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బీసీబీ యాంటీ కరప్షన్‌ యూనిట్‌  షకిబుల్‌తో పాటు సహచర ఆటగాళ్లను గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగుచూసింది.




ఇక  ఎలాంటి బాధ్యత లేకుండా  వ్యవహరించిన  షకిబుల్‌ పై  ఐసీసీ సీరియస్‌ అయ్యింది. దాంతో అతని పై  తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.  ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ 2.4.4 కింద  షకిబుల్‌పై 18 నెలల పాటు నిషేధం విధించడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.  ఒకవేళ  ఇదే కనుక జరిగితే అతని కెరీర్ దాదాపు ముగిసినట్లే. ఇదిలా ఉంటే  ఇటీవల  బోర్డు తమ డిమాండ్లను  తీర్చాలని  స్ట్రైక్ చేసిన  బంగ్లా క్రికెటర్లకు షకిబుల్ నాయకత్వం  వహించాడు.  అయితే ఓ రెండు డిమాండ్ లను తప్ప  మిగితవాటిని నెరవేర్చుతామని  బోర్డు  హామీ ఇవ్వడం తో  క్రికెటర్లు  స్ట్రైక్ విరమించారు.  ప్రస్తుతం  బంగ్లాదేశ్ జట్టు  ఇండియా లో పర్యటించాల్సి వుంది.  ఈటూర్ లో  ఇండియా తో  బాంగ్లా  టీ 20 , టెస్ట్ సిరీస్ లలో  తలపడనుంది.   అందులో  భాగంగా  నవంబర్ 3న  ఇండియా - బంగ్లాదేశ్ లమధ్య  మొదటి టీ 20 మ్యాచ్ జరగనుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: