బంగ్లాదేశ్ టెస్ట్,  టి-20 కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పై ఐసీసీ పై నిషేధం వేటు  వేసింది.  అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా రెండేళ్లపాటు నిషేధిస్తున్నట్లు ఐసీసీ  ప్రకటించింది.  2018 జనవరిలో బంగ్లాదేశ్శ్రీలంకజింబాబ్వే ముక్కోణపు టోర్నీ సందర్భంగా షకీబ్ ను  బుకీలు సంప్రదించారు.  ఈ విషయం ఐసీసీకి వెల్లడించడం విఫలమైనందుకు ఆర్టికల్ 2 .4 . 4  ప్రకారం అతడి పై  రెండు అభియోగాలు నమోదయ్యాయి.


 2018 ఐపీఎల్ సందర్భంగా  ఏప్రిల్ 26న సన్ రైజర్స్  హైదరాబాద్,  కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ సందర్భంగా కూడా బుకీలు షకీబ్ ను  సంప్రదించారు . కానీ ఈ విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి   వెల్లడించే కాకపోవడంతో షకీబ్ మరో  అభియోగం నమోదు అయింది .  ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నమోదు చేసిన అభియోగాలను షకీబ్  అంగీకరించాడు.  దీంతో అతడి పై  ఒక ఏడాది పూర్తిగా నిషేధం విధించిన ఐసీసీ ,  మరో ఏడాది సస్పెన్షన్ చేస్తున్నట్టు  వెల్లడించింది.  ఐసీసీ అవినీతి నిరోధక విభాగం జరిపిన విచారణలో తన తప్పును షకీబ్ అంగీకరించిన నేపథ్యంలో వచ్చే ఏడాది ఏప్రిల్ ఆస్ట్రేలియాతో జరిగే టి20 ప్రపంచకప్ కు  దూరం కానున్నాడు .


 2020 అక్టోబర్ 29 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు షకీబ్ కు ఐసీసీ  అనుమతి ఇచ్చింది.  షకీబ్ పై  ఐసీసీ నిషేధం విధించిన నేపధ్యం లో  టీమిండియాతో జరిగే సిరీస్ కు  బంగ్లా జట్టు కు  కొత్త కెప్టెన్  ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.  టెస్ట్ జట్టుకు ముష్పికర్, టి 20 జట్టుకు మొసాదిఖ్ హుస్సేన్ ను కెప్టెన్లుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది .   నవంబర్ 3వ తేదీ నుంచి బంగ్లాదేశ్ పర్యటన భారత్ లో  ప్రారంభం కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: