ఐపీఎల్ పోరు  ఎంతో రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే మొట్టమొదటిసారిగా ఐపీఎల్ లోకి హైదరాబాద్ నుంచి సిరాజ్ అనే యువ బౌలర్ ఎంపికైన విషయం తెలిసిందే. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున మొదటి ఎంపికైన సిరాజ్ మొదటి జరిగిన ఐపిఎల్ లో అంతగా రాణించలేదు. ఆ తర్వాత కూడా ఆశించిన స్థాయిలో రాణించలేక పోవడంతో హైదరాబాద్ అభిమానులు అందరూ నిరాశ చెందారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో రాయల్ బెంగళూరు జట్టులో మొహమ్మద్ సిరాజ్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇక మహమ్మద్ సిరాజ్ కి ఈ సీజన్  లో  సరిగ్గా భోజనం చేసే అవకాశం రాకపోవడం ఒకవేళ అడపాదడపా అవకాశాలు వచ్చినప్పటికీ అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడం తో అభిమానులందరికీ మరోసారి నిరాశే ఎదురయింది.



 కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సిరాజ్  తన సత్తా చాటాడు. ఏకంగా తక్కువ  పరుగులకే బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంతో పాటు ఏకంగా  కీలకమైన మూడు వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్య పరిచాడు యువ హైదరాబాద్ బౌలర్ మహ్మద్ రఫీసిరాజ్. అయితే నిన్న జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు కేవలం 20 ఓవర్లలో 84 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సునాయాసంగా ఏకంగా రెండు వికెట్ల నష్టానికి విజయం సాధించింది.



 ఇంకా 39 బంతులు మిగిలి ఉండగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టార్గెట్ ను ఛేదించి  ఘన విజయాన్ని అందుకొని పాయింట్ల పట్టికలో ఒక్కసారిగా పైకి ఎగబాకింది. అయితే నిన్న జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ కుర్రాడు ప్రదర్శనపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎన్నో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ తో పాటు టీమిండియాకు కూడా ఆడాడు సిరాజ్ . కానీ ఇప్పటివరకు ఆశించిన ప్రదర్శన చేయలేదు. కానీ నిన్న జరిగిన మ్యాచ్లో ఒక్కసారిగా హీరోగా మారిపోయిన సిరాజ్  ఒక మెయిడెడ్  ఓవర్ వేయడంతో పాటు మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక సిరాజ్  ప్రదర్శన రానున్న రోజుల్లో కూడా ఇలాగే కొనసాగాలని హైదరాబాద్ వాసులు అందరూ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: