ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్  కూడా రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇక కొన్ని మ్యాచ్లు అయితే నరాలు తెగే ఉత్కంఠ మధ్య ప్రేక్షకులకు ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. అయితే టీ-20 ఫార్మెట్లో ఏ చిన్న పొరపాటు జరిగినా అది పూర్తిగా మ్యాచ్ విజయం పై ప్రభావం చూపుతుంది అన్న విషయం తెలిసిందే . ఇక నిన్న కోల్కతా నైట్రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక చిన్న పొరపాటు తో కోల్కతా నైట్రైడర్స్ జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గెలిచే మ్యాచ్ చేజేతులారా ఓడిపోవాల్సి వచ్చింది. కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.



 చివరి బాల్ వరకు ఎవరు గెలుస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ఇక చివర్లో రవీంద్ర జడేజా చెలరేగి ఆడటంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 12 బంతుల్లో 30 పరుగులు అవసరమైన సమయంలో రవీంద్ర జడేజా క్రీజు  లోకి వచ్చాడు.. అయితే ఆ సమయంలో క్రీజ్లో ఉన్న జడేజా సామ్ కరణ్ లు  తొలి నాలుగు బంతుల్లో 7 పరుగులు రాబట్టారు. దీంతో సమీకరణం కాస్త 8 బంతుల్లో 23 పరుగులు గా మారిపోయింది.  అప్పటివరకు మ్యాచ్  మొత్తం కోల్కతా చేతుల్లోనే ఉంది.



 ఇదే సమయంలో 19వ ఓవర్లో అయిదో బంతిని హై ఫుల్ టాస్ రూపంలో ఫెర్గ్యూసన్  సంధించాడు. దీంతో ఆ బంతికి జడేజా రెండు పరుగులు రాబట్టారు. అంపైర్ నో బాల్ గా ప్రకటించాడు. ఇక ఆ తర్వాత ప్రీహీట్ బంతిని జడేజా సిక్స్ గా  మరిచాడు. ఆఖరి బంతికి ఫోర్ బాదేశాడు. కేవలం చివరి రెండు బంతుల్లోనే 13 పరుగులు సమర్పించుకున్నాడు ఫెర్గ్యూసన్. దీంతో ఆ తర్వాత ఓవర్లో ఆరు బంతుల్లో 10 పరుగులు గా మారిపోయింది సమీకరణం. ఇక అప్పటికే వరుసగా  సిక్సర్లు బాదిన రవీంద్ర జడేజా ఎంతో సునాయాసంగా చెన్నై సూపర్ కింగ్స్ కీ విజయం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: