టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ సూప‌ర్ 12 ద‌శ ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే తొలి మ్యాచ్‌లో వెస్టిండిస్ జ‌ట్టును ఇంగ్లండ్ చిత్తు చేసింది. మ‌రో మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా పై ఆస్ట్రేలియా విజ‌యం సాధించింది. ఈ రోజు బంగ్లాదేశ్ తో శ్రీలంక , మ‌రో మ్యాచ్‌లో దాయాది జ‌ట్లు అయిన పాకిస్తాన్ - భార‌త్ త‌ల ప‌డుతున్నాయి. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2 లో ఒక్కో గ్రూపులో ఆరు జ‌ట్ల చొప్పున మొత్తం 12 జ‌ట్లు ఉన్నాయి. అయితే గ్రూప్ 1తో పోలిస్తే గ్రూప్ 2 లో పోరు చాలా సులువుగానే క‌నిపిస్తోంది.

గ్రూప్ 2లో భార‌త్‌, పాకిస్తాన్ , కీవీస్ జ‌ట్ల మ‌ధ్యే పోటీ ఉండ‌నుంది. ఎందుకంటే ఈ గ్రూప్‌లో మిగిలిన మూడు జ‌ట్ల బ‌ల‌హీనమైన‌వే. న‌మీబియా , స్కాట్లాండ్‌, అప్ఘ‌నిస్తాన్ ఉన్నాయి. ఈ మూడు జ‌ట్ల‌ను వ‌దిలేస్తే ఇక్క‌డ సెమీస్ కు వెళ్లేందుకు పాక్ , కీవీస్‌, భార‌త్ మాత్ర‌మే అమీతుమీ తేల్చుకోను న్నాయి.

ఇక గ్రూప్ 1 మాత్రం గ్రూప్ ఆఫ్ డెత్ గా ఉండ‌నుంది. ఇక్క‌డ అన్ని జ‌ట్లు బ‌లంగానే క‌నిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా - ద‌క్షిణాఫ్రికా - ఇంగ్లండ్ - వెస్టిండిస్ - శ్రీలంక ఐదు ప్ర‌ధాన‌మైన జ‌ట్లు.. ఇక గ్రూప్ లో ఆరో జ‌ట్టుగా బంగ్లాదేశ్ కూడా ఉంది. బంగ్లాదేశ్ ను చిన్న జ‌ట్టుగా త‌క్కువ అంచ‌నా వేయ‌డం అంత మూర్ఖ త్వం మ‌రొక‌టి ఉండ‌దు. పెద్ద జ‌ట్లు కూడా బంగ్లాదేశ్ ను ఏ మాత్రం చిన్న జ‌ట్టుగా చూడ‌వు. మ‌రో వైపు శ్రీలం క ఆట తీరు ఇటీవ‌ల దారుణంగా ప‌డిపోయింది. అయితే అనూహ్యంగా క్వాలీఫ‌యింగ్ పోటీ ల్లో ఏకంగా మూడు మ్యాచ్ ల‌లో నూ విజ‌యం సాధించింది.

ఇక ఆస్ట్రేలియా , ద‌క్షిణాఫ్రికా, ఇంగ్లండ్ తో పాటు టీ 20 లో ప్ర‌మాద కారి అయిన వెస్టిండిస్ ను ఎప్పుడూ త‌క్కువ అంచ‌నా వేయ‌లేని పరిస్థితి. అందుకే ఈ గ్రూప్ నుంచి ఎవ‌రు సెమీస్ కు వెళ‌తార‌న్న ది మాత్రం అంచ‌నా కు రాలేని ప‌రిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: