ప్రస్తుతం బీసీసీఐలో నెలకొన్న పరిస్థితుల కారణంగా టీం ఇండియా ఆటలో కొంచెం వెనుకబడింది అనే చెప్పాలి. గత ఏడాది చివర్లో డీలా పడిపోయిన భారత జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్ లో వెనుకపడి పోయింది. దాంతో  ఐసీసీ 2021 సంవ‌త్స‌రానికి గాను ప్ర‌క‌టించిన వ‌న్డే, టీ20 జ‌ట్టులో ఒక్క భార‌త భారత ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. కానీ తాజాగా ప్రకటించిన టెస్టు జ‌ట్టులో ముగ్గురు భార‌త ఆట‌గాళ్ల‌కు చోటు ద‌క్కింది. ఒక బ్యాట‌ర్, వికెట్ కీప‌ర్, బౌల‌ర్ ఎంపిక‌య్యారు. అంతేకాకుండా ఈ జ‌ట్టులో భార‌త్ నుంచే ఎక్కువ మందికి చోటు ద‌క్క‌డం విశేషం.

ఐసీసీ టెస్టు జ‌ట్టులో ఓపెన‌ర్‌గా  హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ చోటు ద‌క్కించుకున్నాడు. రోహిత్‌ గతేడాది క్యాలెండర్‌ ఇయర్‌లో 47.68 సగటుతో 906 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. రోహిత్‌ సాధించిన రెండు సెంచరీల్లో ఒకటి స్వదేశంలో, మరొకటి విదేశంలో నెలకొల్పాడు. అయితే ఈ రెండు సెంచరీలు కూడా ఇంగ్లండ్‌ కు వ్యతిరేకంగానే బాదటం విశేషం. అలాగే వికెట్ కీప‌ర్‌గా ఎంపికైన రిష‌బ్ పంత్... 2021లో 12 మ్యాచ్ లలో 748 పరుగులు చేశాడు. అలాగే వికెట్ కీప‌ర్‌గా 39 మందిని ఔట్ చేసిన స‌త్తా చాటాడు. ఇక స్పిన్ బౌల‌ర్‌గా ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఈ జట్టుకు ఎంపికయ్యాడు. గ‌తేడాది స‌త్తా చాటిన అశ్విన్ 8 మ్యాచ్ లలో 52 వికెట్లు తీసాడు. 2021 ఏడాదికిగాను అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ మొదటి స్థానంలో ఉన్నాడు. కానీ ఈ జట్టులో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చోటు సంపాదించలేకపోయాయడు. అయితే ఐసీసీ 2021 టెస్టు ఎలెవన్‌ జట్టుకు కెప్టెన్ గా కేన్ విలియ‌మ్స‌న్ ఎంపిక కాగా... ఇతర ఆటగాళ్లు దిముత్ కరుణరత్నే, మార్నస్ లబుషేన్‌, జో రూట్, పాకిస్థాన్  ఫవాద్ ఆలం, బ్లాక్ క్యాప్స్ కైల్ జేమీసన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిదీ చోటు సంపాదించుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ipl