ఈ ఏడాది  ఐపీఎల్లో మొదట వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత వరుస ఓటములతో సతమతమైంది. ఏది ఏమైనా ఢిల్లీ క్యాపిటల్స్ పటిష్టంగా కనిపిస్తున్న తీరు చూస్తే ప్లే ఆఫ్ లో అడుగు పెట్టడం ఖాయమని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే అభిమానులందరినీ కూడా తీవ్రంగా నిరాశ పరుస్తూ ఇటీవలే ముంబై ఇండియన్స్ లో జరిగిన మ్యాచ్ లో ఏ జట్టు ఓటమిపాలైంది అన్న విషయం తెలిసిందే. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో  ఓటమి చవి చూడటంతో చివరికి ప్లే ఆఫ్ లో అడుగుపెట్టకుండా ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఈ విషయాన్ని అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ బావోద్వేగ పూరితమైన పోస్ట్ పెట్టనా ఇది వైరల్ గా మారిపోయింది. ఈ సీజన్లో తనకు అవకాశం ఇచ్చిన ఢిల్లీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు డేవిడ్ వార్నర్. ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో తనను తన కుటుంబాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మీరు నా పట్ల నా కుటుంబం పట్ల చూపించిన ప్రేమ అభిమానం ఆప్యాయతలకు ఎప్పుడు రుణపడి ఉంటాను. మమ్మల్ని మీ కుటుంబ సభ్యుల చూసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. అయితే మేము ఆశించిన ఫలితం రాకపోయినప్పటికీ జట్టులో ఆటగాళ్లు సహాయక సిబ్బంది కోచ్ ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడ్డారు.


 మేం చేయాల్సిందల్లా చేశాము తప్పుల నుంచి కొన్ని విషయాలను నేర్చుకుని మళ్ళీ తిరిగి బలంగా తిరిగి రావడం మిగిలి ఉంది. అందరికీ ధన్యవాదాలు మీ ప్రేమే లేకపోతే మేము చేయాలనుకున్నది అసలు చేయలేము. మిమ్మల్ని ఆనందం గా ఉంచడానికి మీరు అనుకున్నట్లుగా ఆడటానికి ఎంతగానో శ్రమించామూ. ఇక సెలవు వచ్చే సీజన్ వరకు మీరంతా క్షేమంగా ఉండండి అంటు డేవిడ్ వార్నర్ ఒక భావోద్వేగ పూరితమైన పోస్టు పెట్టాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: