సాధారణంగా ఒక ఆటగాడిగా అరుదైన రికార్డులు సాధించి లెజెండ్స్ సరసన చోటు సంపాదించుకోవాలంటే అది ఎంతో కష్టమైన పని. అలాంటిది జట్టుకు తాత్కాలిక కెప్టెన్ గా ఉండి ఏకంగా సారథిగా దిగ్గజాలు సరసన ఛాన్స్ దక్కించుకోవడం అంటే అదృష్టం అని చెప్పాలి. ఇక ఇటీవల కేఎల్ రాహుల్ కు ఇలాంటి అదృష్టం వరించింది అనేది తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి గాయం కారణంగా జట్టుకు దూరమైన కె.ఎల్.రాహుల్..  ఇటీవలే జింబాబ్వే పర్యటనలో భాగంగా టీమిండియా తో చేరాడు.


 ఇక జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను కూడా చేపట్టాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే జింబాబ్వే లోని హరారే వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఇండియా విజయం సాధించింది జింబాబ్వే జట్టు. తమ ముందు ఉంచిన 189 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేధించింది భారత జట్టు. దీంతో పది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఇక ఈ ఒక్క విజయంతో  అటు కె.ఎల్.రాహుల్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. తాత్కాలిక కెప్టెన్ అయినప్పటికీ ఈ ఒక్క విజయంతో గొప్ప సారథిగా దిగ్గజాల తరఫున చేరిపోయాడు అని చెప్పాలి.


 ఏకంగా పది వికెట్ల తేడాతో ఇండియాకు విజయాన్ని అందించిన ఎనిమిదవ భారత కెప్టెన్గా కె.ఎల్.రాహుల్ నిలిచాడు అని చెప్పాలి. ఇక ఈ లిస్టులో చూసుకుంటే ఇంతకుముందు 1975లో వెంకట రాఘవన్ మొదటి సారి టీమిండియాకు పది వికెట్ల తేడాతో విజయాన్ని అందించిన కెప్టెన్గా కొనసాగుతున్నాడు. 1984లో సునీల్ గవాస్కర్, 1997లో సచిన్ టెండూల్కర్,  1998లో మహ్మద్ అజారుద్దీన్,  2001లో సౌరబ్ గంగూలీ, 2016 లో ఎమ్మెస్ ధోని ఈ అరుదైన రికార్డును అందుకోవడం గమనార్హం. అయితే విరాట్ కోహ్లీ ఎన్నో ఏళ్ల పాటు టీమిండియా కెప్టెన్సీ వహించినప్పటికీ ఈ అరుదైన రికార్డును మాత్రం అందుకోలేకపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: