వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్.. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా యూనివర్సల్ బాస్.. ఒకసారి అతను మైదానంలోకి దిగాడు అంటే చాలు స్కోర్ బోర్డు సైతం భయపడుతుంది. ఎందుకంటే పరుగులు పెడుతూ అలసి పోవాల్సి వస్తుందేమో అని.. బౌలర్లు సైతం వణికి పోతూ ఉంటారు  ఎందుకంటే క్రిస్ గేల్ విధ్వంసానికి తమ ఖాతాలో ఎక్కడ చెత్త రికార్డులు చేరిపోతాయో అని.. గేల్ సిక్సర్లు ఫోర్లు చెలరేగి పోతుంటే మైదానం మొత్తం దద్దరిల్లి పోతూ  ఉంటుంది అని చెప్పాలి. ఎంతో అలవోకగా బంతిని బౌండరీకి తరలించడం క్రిస్ గేల్ వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి. ఆటతీరుతో నే కాదు తన ఆటిట్యూడ్ తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ విధ్వంసకర బ్యాట్స్మెన్.


 అయితే ఆన్ ఫీల్డ్ లో ఎంత ఉత్సాహం గా ఉంటాడో ఆఫ్ ది ఫీల్డ్ లో కూడా అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇక ఎప్పుడు సహచరులతోనే కాదు ప్రత్యర్థులతో కూడా ఎంతో సరదాగా మాట్లాడుతూ క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక కేవలం మైదానంలోనే కాదండోయ్ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు సరదాగా కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇకపోతే ఇటీవలే మరోసారి తన ఫన్నీ కామెంట్లతో వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం యూనివర్సల్ బాస్ గేల్ కరేబియన్ దీవులలో జరగబోయే సరికొత్త టోర్నీ సిక్స్ టీ కోసం సిద్ధమయ్యాడు.


 ఈ టోర్నీ టీ10 ఫార్మాట్లో జరుగుతుంది. నిన్నటి నుంచే ఈ టోర్నీ ప్రారంభం అయ్యింది అని చెప్పాలి. ఈ సందర్భంగా ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు క్రిస్ గేల్. ఈ సందర్భంగా సరదా వ్యాఖ్యలు చేశాడు. మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అంటూ తెలిపాడు. ఇక ఈ టోర్నీలో బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కూడా రాణించాలని అనుకుంటున్నాను. అయితే ప్రపంచ క్రికెట్లో నేనే అత్యుత్తమ స్పిన్నర్ అని కామెంట్ చేశాడు. ముత్తయ్య మురళీధరన్ కూడా నాలా బౌలింగ్ చేయలేకపోయాడు. సునీల్ నరైన్ కూడా నా దగ్గరికి రాలేడు అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు క్రిస్ గేల్.

మరింత సమాచారం తెలుసుకోండి: