ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడు సిరీస్ కాస్తా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ తో ముగిసింది. మొహాలీలో జరిగిన మొదటి మ్యాచ్ లో 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఇండియాకు గట్టి షాక్ ఇచ్చింది ఆసిస్. అయితే ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ లలో పుంజుకున్న టీం ఇండియా ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్ ను చేజిక్కించుకుంది. అయితే ఈ ఓటమి అంత ఈజీ గా అయితే దక్కలేదు ఇండియాకు.. చివరి రెండు బంతుల వరకు మ్యాచ్ కొనసాగింది. కానీ తీవ్ర ఒత్తిడిలోనూ స్మార్ట్ గా కూల్ గా ఫినిష్ చేసే హార్దిక్ ఉండగా ఇండియానే విజయం వరించింది. అయితే ఈ ఓటమి అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ మరియు తోటి ఆటగాళ్లు వివిధ కారణాలు చెప్పారు.

కానీ ఆ జట్టు హెడ్ కోచ్ ఆండ్రు మేక్ డోనాల్డ్ మాత్రం కేవలం ఆ ఒక్క ప్లేయర్ వల్లే మేము సిరీస్ ను కోల్పోయాము అంటూ తన ఆవేదనను తెలిపారు. అనుకోకుండా సిరీస్ లో అవకాశం దక్కించుకున్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ గురించి మేక్ డోనాల్డ్ మాట్లాడం అందరినీ ఎంతగానో ఆచరర్యపరిచింది అని చెప్పాలి. వాస్తవానికి రవీంద్ర జడేజా ఈ సిరీస్ లో ఉండాల్సింది.. కానీ ఆసియా కప్ లో గాయపడడం వలన అక్షర్ కు అవకాశం వచ్చింది. అయితే మేక్ డోనాల్డ్ మాట్లాడుతూ రవీంద్ర జడేజా ఈ సిరీస్ లో లేడు కదా అని ఊపిరి పీల్చుకుంటే అక్షర్ పటేల్ మామ్మలం నిలువునా ముంచేశాడు అంటూ బాధపడ్డాడు.

ఇండియా జడేజాకు బదులుగా అక్షర్ లాంటి ఆయుధాన్ని రెడీ చేసుకుని సక్సెస్ అయింది అంటూ ప్రశంసలు కురిపించాడు. అక్షర్ బౌలింగ్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఇతను ఈ సిరీస్ లో 8 వికెట్లు తీసుకుని ఇండియా విజయానికి ప్రధాన కారణం అయ్యాడు. దీనితో అక్షర్ పటేల్ వరల్డ్ కప్ కు కూడా చక్కగా ఉపయోగపడతాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: