ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న టి20 సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు పయనం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. కాగా వరల్డ్ కప్ కు ఆడేందుకు ఇప్పటికే బీసీసీఐ సెలెక్ట్ చేసిన జట్టులో కీలక బౌలర్ బుమ్రా మినహా 15 మందితో కూడిన భారత బృందం మెగా ఈవెంట్ కు వారం రోజుల ముందే అటు ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే టి20 వరల్డ్ కప్ కోసం స్టాండ్ బై ఆటగాళ్లుగా రవి బిష్ణయ్, దీపక్ చాహార్ శ్రేయస్ అయ్యర్ లు అక్టోబర్ 12వ తేదీన ఆస్ట్రేలియాకు బయలుదేరబోతున్నారు.


 అయితే ఇలా టీమిండియా వరల్డ్ కప్కు స్టాండ్ బై ప్లేయర్లుగా ఉన్న ముగ్గురు ఆటగాళ్లు కూడా అటు స్వదేశంలో దక్షిణాఫ్రికా తో జరగబోయే వన్డే సిరీస్ లో భాగంగా ఉన్నారు అని చెప్పాలి. అయితే ఒకవైపు 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టు పాటు అటు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనేందుకు నెట్ బౌలర్లు కూడా ఆస్ట్రేలియాకు వెళ్ళబోతున్నారు అన్నది తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్ లాంటి పేస్ బౌలర్లను ఇక వరల్డ్ కప్ లో టీమిండియా నెట్ బౌలర్గా బీసీసీఐ ఎంపిక చేసింది. ఇక ఇప్పుడు మరో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను కూడా నెట్ బౌలర్లుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.


 ఇక ఇలా టీమిండియా నెట్ బౌలర్లుగా ఎంపిక చేసిన వారిలో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరి, చేతన్ సకారియా ఉన్నారట. కాగా  ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరి తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఒత్తిడిలో కూడా ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతూ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఒకవేళ ముఖేష్ చౌదరి నెట్ బౌలర్లుగా అక్కడ ఉన్న టీమిండియా యాజమాన్యాన్ని ఆకట్టుకున్నాడు అంటే ఇక రానున్న రోజుల్లో టీమిండియా తుదిజట్టులోకి అతను వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl