టీ 20 వరల్డ్ కప్ 2022 ను గెలుచుకుని ఛాంపియన్ గా నిలిచిన ఇంగ్లాండ్ ఇంకా ఆ సంతోషాన్ని మరిచినట్లు లేదు. అదే హుషారులో ఇప్పుడు పాకిస్తాన్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఇంగ్లాండ్ పాకిస్తాన్ పర్యటనకు మొత్తం మూడు టెస్ట్ లు ఆడడానికి విచ్చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మొదటి టెస్ట్ ఈ రోజు షెడ్యూల్ ప్రకారం రావల్పిండి లో మొదలైంది. మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ తీసుకోవడానికి మొగ్గుచూపాడు. ఓపెనర్లు గా బెన్ డక్కెట్ మరియు జాక్ క్రాలీ లు వచ్చారు. వీరిద్దరూ ఆరంభం నుండి పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.

కనీసం ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా టీ 20 రీతిలో ఎడాపెడా బౌండరీలు బాదుతూ పరుగులు పిండుకున్నారు. కేవలం 13.5 ఓవర్ లలోనే ఇంగ్లాండ్ స్కోర్ పరుగులు చేరడం విశేషం. ఈ దశలో ఇద్దరూ తమ సెంచరీలు పూర్తి చేసుకున్నారు, క్రాలీ (122) మరియు డక్కెట్ (107) లు మొదటి వికెట్ కు 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత ఓలి పోప్ (108) కూడా వన్ డౌన్ గా వచ్చి సెంచరీ చేసి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోయాగం చేసుకున్నాడు. మరో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ బ్రూక్ (101) సైతం సెంచరీ సాధించి పాకిస్తాన్ బౌలింగ్ లో పసలేదని నిరూపించారు. ఇక ఆఖర్లో స్టోక్స్ కూడా మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి జట్టు స్కోర్ ను 500 పరుగులు దాటించాడు.

అయితే ఈ రోజు కనీసం ఓవర్లు జరగాల్సి ఉండగా వెలుతురు సరిగా లేని కారణంగా 75 ఓవర్ ల తర్వాత ఆటను అంపైర్లు నిలిపివేశారు. దీనితో టెస్ట్ లలో ఒక్క రోజులో అధిక పరుగులు సంధానించిన జట్టుగా ఇంగ్లాండ్ రికార్డ్ పుటల్లోకెక్కింది. ఇంతకు ముందు ఆస్ట్రేలియా 494 పరుగులు సౌత్ ఆఫ్రికా మీద 1910 వ సంవత్సరంలో ఉంది. ఇంగ్లాండ్ మెరుపు బ్యాటింగ్ కు 112 సంవత్సరాల రికార్డ్ తుడిచిపెట్టుకుపోయింది. పాకిస్తాన్ బౌలర్లలో మహమూద్ ఒక్కడే 2 వికెట్లు తీసుకున్నాడు.      


మరింత సమాచారం తెలుసుకోండి: