టీమ్ ఇండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నది రిషబ్ పంత్ గత కొంతకాలం నుంచి కూడా ఎందుకొ  స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు అనే విషయం తెలిసిందే. వరల్డ్ కప్ నాటి నుంచి కూడా  పంత్ పేలవమైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ అటు బీసీసిఐ మాత్రం అతని చేతిలో కొనసాగిస్తూ వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆడిన టి20 సిరీస్ వన్డే సిరీస్లలో రెగ్యులర్గా తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు రిషబ్ పంత్.


 కానీ ఒక్క మ్యాచ్ లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా రిషబ్ పంతును పక్కకు పెట్టేసింది జట్టు యాజమాన్యం. అయితే గాయం కారణంగా రిషబ్ పంత్ జట్టుకు దూరమయ్యాడని కొంతమంది అనుకుంటే.. ఇక పేలవ ప్రదర్శన కారణంగానే అతని పక్కకు పెట్టిందని మరి కొంతమంది అనుకుంటున్నారు. పంతు లేకపోవడంతో ఏకంగా కీపింగ్ బాధ్యతలను కేఎల్ రాహుల్ నిర్వహించాడు. ఒక క్యాచ్ వదిలేయడంతో అతనిపై విమర్శలు వచ్చాయ్ అనే విషయం తెలిసిందే.


 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. నేను కే ఎల్ రాహుల్ ని ఆల్ రౌండర్ గా పరిగణిస్తాను  అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రిషబ్ పంతును పక్కన పెట్టిన నష్టమేమీ లేదు అంటూ అభిప్రాయపడ్డాడు. సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన సునీల్ గవాస్కర్ ధావన్, రోహిత్ శర్మ ఓపెనర్గా కోహ్లీ మూడో స్థానంలో వచ్చిన తరుణంలో కేఎల్ రాహుల్ 5వ స్థానంలో బరిలోకి దిగాలి. నాకు తెలిసినంతవరకు ఆ స్థానంలో బ్యాటింగ్కు రావడమే సరైంది. ఇక బహుశా తను కూడా అదే కోరుకుంటున్నాడేమో. ఎందుకంటే కేఎల్ రాహుల్ 5వ స్థానంలో బాటింగ్ చేస్తే జట్టుకు మరో ఎక్స్ ట్రా ఆప్షన్ దొరుకుతుంది అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: