గత కొంతకాలం నుంచి రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. మొన్నటి వరకు అయితే ఓపెనర్ గా బరిలోకి తక్కువ పరుగులు చేసి వికెట్ కోల్పోవడంతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు అని చెప్పాలి. అయితే రోహిత్ శర్మ మునుపటి ఫామ్ లోకి రావాలని అభిమానులు అందరూ కోరుకున్నారు. అయితే అభిమానులు కోరుకున్నట్లుగానే ప్రస్తుతం బ్యాటింగ్లో మంచి టచ్ లో కనిపిస్తూ మునుపటి ఫామ్ లోకి వచ్చినట్లే కనిపిస్తున్నాడు. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా మంచిషాట్లు ఆడుతూ సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోతున్నాడు. ఇక టీమిండియాకు మంచి ఆరంభాన్ని ఇస్తూ  ఉన్నాడు అని చెప్పాలి.


 అయితే రోహిత్ శర్మతో పాటే ఓపెనర్ గా బరిలోకి దిగిన యువ ఆటగాళ్లు రెచ్చిపోయి సెంచరీలతో చెలరేగిపోతూ ఉంటే రోహిత్ మాత్రం ఇక హాఫ్ సెంచరీలను సెంచరీ లాగా మలచడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఇక వన్డే ఫార్మాట్లో రోహిత్ బ్యాట్ నుంచి సెంచరీ వచ్చి దాదాపు మూడేళ్లు గడిచిపోతూ ఉన్నాయి. దీంతో ఎంతో మంది అభిమానులు అతను సెంచరీ చేస్తే చూడాలని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదే విషయంపై ఎంతమంది మాజీ ఆటగాళ్ళు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు.


 గత కొంతకాలం నుంచి నా ఆటలో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. అయితే బౌలర్ల పై ఆదిపత్యం కొనసాగిస్తున్నాను. ఒత్తిడి బౌలర్ల పై ఒత్తిడి తేవడం చాలా ముఖ్యమైన విషయం అన్నది నా ఆలోచన. గత కొంతకాలం నుంచి భారీ స్కోరు చేయలేదని విషయం నాకు తెలుసు. అయితే ఈ విషయం గురించి కంగారు పడాల్సిన అవసరమేం లేదు. ఎందుకంటే నా బ్యాటింగ్ తో ప్రస్తుతం నేను ఆనందంగానే ఉన్నాను. ఇక నా బ్యాటింగ్ అప్రోచ్ మాత్రం నాతోనే ఉంచుకున్నాను. భారీ స్కోరు బాకీ ఉందన్న విషయం నాకు గుర్తుంది అంటూ రోహిత్ శర్మ తన సెంచరీపై స్పందించాడు. అదే సమయంలో ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ఆటగాళ్లందరూ మంచి ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నారని ముఖ్యంగా బౌలింగ్ విభాగం అయితే అద్భుతంగా రానిస్తున్నారు అంటూ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: