సూపర్ ఫామ్ లో కొనసాగుతున్న యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ ఫార్మాట్ తో సంబంధం లేకుండా అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు టీమ్ ఇండియా తరపున సెంచరీల మోత మోగించిన గిల్.. ఐపీఎల్ సీజన్ లోను అదే రీతిలోబ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ యంగ్ సెన్సేషన్ ప్లేయర్.. పరుగుల వరద పారిస్తున్నాడు అని చెప్పాలి.



 మొన్నటికి మొన్న వరుసగా రెండు మ్యాచ్లలో కూడా సెంచరీలు చేసి జట్టు విషయంలో కీలక పాత్ర వహించిన శుభమన్ గిల్ ఇక ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లోను మంచి ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్న గిల్ మాత్రం నిలకడగా రాణించాడు. అయితే ఇటీవలే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో చివరికి చెన్నై జట్టు విజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టింది అన్న విషయం తెలిసిందే. అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ జట్టు ఓడిపోయినప్పటికీ అటు ఆ జట్టు ఓపెనర్ శుభమన్ గిల్ మాత్రం ఓ అరుదైన రికార్డును సృష్టించాడు.



 ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఒక సీజన్లో 700 కు పైగా పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్ గా నిలిచాడు శుభమన్ గిల్. 2023 ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు 75 పరుగులు చేశాడు. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీ 2016 ఐపీఎల్ సీజన్లో 973 పరుగులు చేసి ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు. అప్పటినుంచి ఎవరూ కూడా 700 పరుగుల మార్కును అందుకోలేదు. ఇక ఇటీవలే శుభమన్ గిల్ ఈ ఘనత సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: