యాషెష్ సిరీస్ లో భాగంగా తొలి రెండు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి రెండు పాయింట్లు ఆదిక్యంలోకి వచ్చింది అని చెప్పాలి. అయితే బజ్ బాల్ విధానం ద్వారా ఆస్ట్రేలియను బోల్తా కొట్టించాలి అని భావించిన ఇంగ్లాండ్ కు చేదు అనుభవం ఎదురయింది. ఈ క్రమంలోనే ఇక మూడో మ్యాచ్లో సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తుంది ఇంగ్లాండ్. ఇక మూడో మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలింగ్ విభాగం నిప్పులు చెరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ఇక అటు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ బౌలింగ్ దాటికి ఇబ్బంది పడుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నామ్.
అయితే సిరీస్ లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ నిప్పులు చెరిగాడు. బుల్లెట్ లాంటి బంతులను విసిరి ఆసిస్ బ్యాట్స్మెన్ లను భయపెట్టాడు. ఇక ఇన్నింగ్స్ రెండో ఓవర్ లో ఏకంగా 155.3 కిలోమీటర్ల స్పీడుతో బంతి విసిరాడు. అయితే ఇది యాషెష్ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ డెలివరీ అని చెప్పాలి. ఒక బంతి మాత్రమే కాదు ఆ ఓవర్ మొత్తం 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరాడు. దీంతో కవాజా క్లీన్ బౌల్డ్ అయ్యాడు అని చెప్పాలి. 2013లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ జాన్సన్ 156.8 కిలోమీటర్ల వేగంతో బంతి విసరగా.. సిరీస్ లో ఇదే అత్యంత వేగవంతమైన బంతిగా కొనసాగుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి