సాధారణంగా క్రికెట్లో టి20, వన్డే ఫార్మాట్, టెస్ట్ ఫార్మాట్ అనే మూడు ఫార్మాట్లు ఉన్నప్పటికీ ఎక్కువగా ప్లేయర్స్ ఇష్టపడేది.. ఇక ఎక్కువ కాలం కెరీర్ ను కొనసాగించాలనుకునేది మాత్రం టెస్ట్ ఫార్మాట్లోనే అని చెప్పాలి. ఎందుకంటే ఇక సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్టు ఫార్మాట్లో మెరుగైన ప్రదర్శన చేసి రికార్డులు సృష్టించాలని ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఆశ పడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇక జాతీయ జట్టు తరఫున టెస్ట్ ఫార్మట్ ఆడేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గా ఉన్న అన్ని జట్లు కూడా టెస్ట్ సిరీస్ లో వరుస మ్యాచ్లతో బిజీగా ఉన్న నేపథ్యంలో.. ఇక ఎంతోమంది ప్లేయర్లు అరుదైన రికార్డులు సృష్టిస్తూ ఉన్నారు. ఇలా ప్లేయర్లు సృష్టించిన రికార్డులు అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాయి అని చెప్పాలి. చిరకాల ప్రత్యర్థిగా పిలుచుకొనే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెష్ సిరీస్ జరుగుతూ ఉండగా.  మొన్నటి వరకు అటు ఇండియా, వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ జరిగింది. అదే సమయంలో పాకిస్తాన్- శ్రీలంక మధ్య కూడా టెస్ట్ సిరీస్ జరుగుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ ఓపెనర్ ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.


 రెండో టెస్ట్ మ్యాచ్లో అబ్దుల్లా షఫీక్ డబుల్ సెంచరీ చేసే రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే శ్రీలంకలో డబుల్ సెంచరీ చేసిన తొలి పాకిస్తాన్ ఓపెనర్ గా చరిత్ర ఎక్కాడు. 23 ఏళ్ల వయస్సున అబ్దుల్లా షఫీక్ పాకిస్తాన్ తరఫున డబుల్ సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ క్రికెటర్ గా కూడా రికార్డు సృష్టించాడు. అంతకుముందు జావేద్ మీయాందాడ్, హనీఫ్ మహమ్మద్ లు ఈ ఘనత సాధించారు అని చెప్పాలి. ఇతనికి తోడు అఘ సల్మాన్ కూడా 132 పరుగులతో సెంచరీ తో చెలరేగిపోవడంతో పాకిస్తాన్ భారీ స్కోరు చేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: