
అయితే ఎన్నో రోజులపాటు గాయం కారణంగా టీమ్ ఇండియాకు దూరమైన రవీంద్ర జడేసా మళ్లీ ఇక జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చి తన మునుపటి ఫామ్ తో అదరగొడుతున్నాడు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లోను ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఇక ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే 2023 వన్డే వరల్డ్ కప్ లో కూడా రవీంద్ర జడేజా జట్టులో కీలక పాత్ర పోషించాడు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. అయితే ఇక వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కు వెస్టిండీస్తో జరగబోయే వన్డే, టి20 సిరీస్ లకు విశ్రాంతిని ఇచ్చారు సెలెక్టర్లు.
అయితే ఈ ఖాళీ సమయాన్ని రవీంద్ర జడేజా ఎంతగానో సద్వినియోగం చేసుకుంటున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి యుఎస్ కు వెకేషన్ వెళ్ళాడు. ఇక అక్కడ పర్యటక ప్రదేశాలలో చక్కర్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేసేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ముక్కల ముక్కాబుల లైలా అనే సూపర్ హిట్ పాటకు డాన్సులు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు రవీంద్ర జడేజా. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ వావ్ సూపర్ అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు.