
జట్టులో కీలక ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు ఇక గాయాల బారిన పడుతూ వరల్డ్ కప్ టోల్ ఫ్రీ మొత్తానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇక ఇప్పుడు శ్రీలంకకు కూడా ఇలాంటి షాక్ తగలబోతుంది అన్నది తెలుస్తుంది. లంకా ప్రీమియర్ లీగ్ లో తొడ కండరాల గాయం బారిన పడ్డాడు హసరంగా. అయితే ఇటీవల ఆసియా కప్ కు దూరం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు శ్రీలంక టీం మెడికల్ ప్యానల్ హెడ్ అర్జున డిసిల్వా సైతం హసరంగ ప్రపంచకప్ కు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి అని సంకేతాలు ఇచ్చాడు. హసరంగకు సర్జరీ అవసరమా లేదా అని తెలుసుకోవడానికి మేము విదేశీ వైద్యులను సంప్రదిస్తున్నాం. సర్జరీ చేయాల్సి వస్తే అతను కనీసం మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
ప్రస్తుతం అతని పరిస్థితి బాగాలేదు. అతను ప్రపంచకప్ ఆడకపోవచ్చు అంటూ అర్జున డిసిల్వ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ప్రపంచకప్ నాటికి హసారంగా ఫిట్ గా ఉండేందుకు అటు లంక బోర్డు ప్రయత్నాలను చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే బంతితో పాటు బ్యాడ్ తో కూడా సమర్థవంతమైన ప్రదర్శన చేయగల సత్తా కలిగిన హసరంగా జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఇలాంటి ప్లేయర్ అటు టీం కి దూరం అవడం మాత్రం భారీ ఎదురు దెబ్బ అని చెప్పాలి.