ఎందుకంటే ఇప్పుడు వరకు భారత జట్టు ఒక్కసారి కూడా సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచింది లేదు. దీంతో 31 ఏళ్ల నిరీక్షణకు రోహిత్ శర్మ తన కెప్టెన్సీ తో తెరదించుతాడు అని అభిమానులు అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో అటు భారత జట్టు మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే ఘోరంగా ఓడిపోయింది. 31 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలు అయింది టీమ్ ఇండియా. దీంతో ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈసారి కూడా అటు సౌత్ఆఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవడం అనేది టీమిండియాకు కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది.
అయితే ఇటీవలే మొదటి టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో తీసుకున్న నిర్ణయాలపై కొంతమంది మాజీ ఆటగాళ్లు అసలు తృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఇదే విషయంపై రవి శాస్త్రి కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లంచ్ తర్వాత ఎప్పుడైనా బెస్ట్ బౌలర్లను ప్రయోగించాలి అంటూ రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. రోహిత్ అలా చేయకుండా శార్దూల్ ఠాగూర్, ప్రసిద్ లకు బౌలింగ్ ఇవ్వడాన్ని తప్పుపట్టాడు రవి శాస్త్రి. తాను కోచ్గా ఉన్న సమయంలో చాలా సార్లు ఈ విషయంపై చర్చించాము అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి