యశస్వి జైస్వాల్.. ఈ మధ్యకాలంలో ఇండియన్ క్రికెట్లో బాగా గట్టిగా వినిపిస్తున్న పేరు.  అందరూ యువ ఆటగాళ్ల లాగానే అతను కూడా భారత జట్టులో ఛాన్స్ దక్కించుకున్నాడు. దీంతో జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ వచ్చిందని ఉప్పొంగిపోయాడు. కానీ ఇప్పుడు అతని ఆట తీరు చూస్తుంటే అందరిలా వచ్చిపోయే ఆటగాడు కాదు.. చరిత్రలో నిలిచిపోయి ఆటగాడు కావొచ్చు అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతూ ఉంది. ఎందుకంటే అప్పటికే దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ తన బ్యాటింగ్ విధ్వంసం ఎలా ఉంటుందో చూపించిన యశస్వి జైస్వాల్.. ఇక ఇప్పుడు అటు భారత జట్టులోకి వచ్చాక కూడా అదే ఆట తీరుని కొనసాగిస్తున్నాడు.


 ఎంతో అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్స్ సైతం తడబడి పోతున్న పిచ్ లపై యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారుస్తూ ఉన్నాడు. ఏకంగా సీనియర్ బౌలర్ల బౌలింగ్లో సైతం సిక్సర్లు ఫోర్లతో స్కోర్ బోర్డుకు సైతం ఆయాసం వచ్చేలా అతను అదరగొడుతున్నారు అని చెప్పాలి. ఏకంగా టెస్ట్ ఫార్మాట్ లోను నెమ్మదిగా ఆడటం కాదు.. వన్ డే ఫార్మాట్ తరహాలో సిక్సర్ ఫోర్ లతో చెలరేగిపోతున్నాడు. వరుసగా డబుల్ సెంచరీలు చేస్తూ.. ఇక ఎన్నో అరుదైన రికార్డులు కూడా ఖాతాలో వేసుకుంటున్నాడు ఈ బ్యాచ్మెన్. అయితే ఇక ఇటీవల రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో ఏకంగా ఒకే ఇన్నింగ్స్ లో 21 సిక్సర్లు కొట్టి సంచలనమే సృష్టించాడు. ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మాట్లో అతి తక్కువ సిక్సర్లు మాత్రమే కొట్టిన ఎంతోమంది లెజెండరీ క్రికెటర్లను దాటేందుకు సిద్ధమవుతున్నాడు ఈ యువ ఆటగాడు. అయితే ప్రస్తుతం ఇండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీని దాటేందుకు కేవలం ఒకే ఒక సిక్స్ దూరంలో ఉన్నాడు జైస్వాల్. ఏకంగా సిక్సర్ల జాబితాలో కోహ్లీని దాటి దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నాడు. అయితే విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 191 ఇన్నింగ్స్ లో 26 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. అయితే యశస్వి జైష్వాల్ మాత్రం 13 ఇన్నింగ్స్ లోనే 25 సిక్సర్లు కొట్టాడు అని చెప్పాలి. అయితే నాలుగో టెస్ట్ మ్యాచ్ లో అటు యశస్వి జైస్వాల్ ఒక సిక్స్ కొడితే కోహ్లీ రికార్డును సమం చేస్తాడు. ఇక రెండో సిక్సర్ కొట్టాడా కోహ్లీ లాంటి లెజెండ్నే దాటేస్తాడు అని చెప్పాలి. కాగా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో 80 టెస్ట్ సిక్సర్లు ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: