బిగ్ బాస్ 5 హౌజ్ నుండి గత వారం అనూహ్యంగా హమీదా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. నిజంగా చెప్పాలంటే ఎలిమినేషన్ లో ఉన్న వారి కన్నా హమీదా ఏమీ తీసిపోదు. కానీ ఎందుకో బిగ్ బాస్ ఆమెను హౌజ్ నుండి పంపేశాడు. ఈమె వెళ్లడంతో ఇంట్లో ఒక వర్గం బ్యాచ్ కు సంతోషం రెట్టింపయ్యింది. దీనితో ఈ వారం ఎలిమినేషన్ పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఎన్నడూ లేనంతగా ఈ వారం ఎలిమినేషన్ కు 10 మంది నామినేట్ అయ్యారు. ఇప్పటి నుండే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరి అన్నది వార్తలు ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా విశ్వ, జస్వంత్ మరియు లోబో లు డేంజర్ జోన్ లో ఉన్నారని సమాచారం.

ఇది మనకు తెలిసిన ఓటింగ్ శాతం ను బట్టి ఊహిస్తున్నారు. అయితే లోబో ఇంటిలో కొంతలో కొంతైనా ఎంటర్ టైన్మెంట్ ఇస్తుండటంతో లోబో సేఫ్ అయ్యే ఛాన్స్ ఎక్కువట,  ఇక మిగిలిన విశ్వ మరియు జస్వంత్ లలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవ్వడం పక్కా అని తెలుస్తోంది. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. అయితే బిగ్ బాస్ ఎలిమినేషన్ విధానం గురించి ఒక కీలక విషయం బయటపడింది. అందరూ ఇప్పటి వరకు అనుకుంటున్నట్లు ఇంటి సభ్యులకు పడిన ఓట్ల వల్ల ఎలిమినేషన్ చేయడం లేదట... ఇంటి సభ్యులకు నిర్దేశించిన ఫోన్ నంబర్ కు ఇచ్చిన మిస్ కాల్ ను ఆధారంగా చేసుకుని ఎలిమినేట్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక ఈ వారంలో మీకు నచ్చిన ఇంటి సభ్యుని సేవ్ చేయడానికి మిస్ కాల్ ఇచ్చే అవకాశం రేపటి వరకు మాత్రమే ఉంది. మరి గత వారం కూడా లీక్ ల ఆధారంగా ఎలిమినేషన్ జరగలేదు. అదే విధంగా ఈసారి కూడా బిగ్ బాస్ ప్లాన్ చేస్తారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: