బుల్లితెరపై సుధీర్, రష్మీ జంటకు ప్రత్యేకంగా గుర్తింపు ఉంది. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన వీరు సినిమాలలో కూడా బాగానే రాణిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సుధీర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మీ అడపా దడపా సినిమాలలో చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉంటోంది. రష్మీ కూడ ఒక వైపు యాంకర్ గానే బిజీగా ఉన్నది. ఇక సోషల్ మీడియాలో కూడా వీరిద్దరికి విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పవచ్చు. సుధీర్ గాలోడు సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్నారు. సుధీర్ నటించిన మొదటి మూడు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.


రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో గాలోడు వంటి మాస్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో హీరోయిన్ గా గేహన సిప్పీ నటించింది. ముఖ్యంగా ఈ సినిమాకు హీరోయిన్ అందాలు ప్లస్ అని చెప్పవచ్చు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా దాదాపుగా రూ.3 కోట రూపాయల వరకు కలెక్షన్లు సాధించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు వచ్చినట్లుగా సమాచారం. ఈ సినిమా సక్సెస్ కావడంతో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి తన ఆనందాన్ని పంచుకుంటూ తన డైరెక్షన్లో మరొక ప్రాజెక్టును ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈసారి ముచ్చటగా మూడవసారి సుదీర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా లో రష్మీ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇక గతంలో కూడా వీరిద్దరూ బుల్లితెర పైన ఎంత ట్రెండ్ ని సెట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుచేతనే ఈ జంటను తీసుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కూడా సీతారామం సినిమాని మించి ఉండబోతోంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే గాలోడు సినిమా సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చిత్ర బృందం.

మరింత సమాచారం తెలుసుకోండి: