బుల్లితెరపై ప్రవసారమయ్యేటువంటి కామెడీ షోలలో జబర్దస్త్ షో కూడా ఒకటి.. ఈ షోలో ఎప్పుడూ కూడా మార్పులు జరుగుతూనే ఉంటాయి. గత రెండేళ్లుగా ఎక్కువగా మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.. ముఖ్యంగా నాగబాబు ,రోజా వంటి వారు జడ్జి నుంచి తప్పుకోవడంతో ఆ తర్వాత అంతటి స్థాయిలో ఎవరు మెప్పించలేకపోతున్నారు. అలాగే యాంకర్ గా అనసూయ కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో రేటింగ్ కూడా భారీగాన్ని తగ్గిపోయింది. చాలామంది కమెడియన్స్ కూడా తప్పుకోవడంతో రోజు రోజుకి జబర్దస్త్ కామెడీ షో రేటింగ్ విషయంలో పడిపోతుంది.జడ్జిలుగా శేఖర్ మాస్టర్ చేశారు ఆ తర్వాత కృష్ణ భగవాన్, కుష్బూ, ఇంద్రజ, ఆమని తో పాటు యాంకర్ గా సౌమ్యరావుని తీసుకొచ్చినప్పటికీ కొద్దిరోజులు బాగానే నెట్టుకొచ్చిన ఆ తర్వాత ఈమె స్థానంలో బిగ్ బాస్ సిరి హనుమంతుని తీసుకువచ్చారు. ప్రస్తుతం అయితే ఈమె కంటిన్యూ అవుతున్న రాబోయే రోజుల్లో మార్చే అవకాశం ఉన్నది. తాజాగా జబర్దస్త్ షోకి ఇంద్రజ కూడా గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.


కొంతకాలం గ్యాప్ తీసుకుంటున్నానని ఇంద్రజ తెలియజేసింది. అంటే మళ్లీ వచ్చే అవకాశం ఉన్నది.ఈ సందర్భంగా తన వీడ్కోలుని కూడా ఎమోషనల్ గా తెలియజేసింది ఇంద్రజ.. అయితే ఆమె ఇలా గ్యాప్ తీసుకోవడానికి గల కారణం ఏంటనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు.. కేవలం జబర్దస్త్ ని పొగుడుతూ జబర్దస్త్ ఒక ఫ్యామిలీ లాగా భావించాను అందరూ తనని అమ్మ అని పిలుస్తూ ఉంటే చాలా ప్రేమగా ఉండేది ఆ ప్రేమతో చాలా మునిగిపోయాను అందుకే వారి మధ్య నుంచి వెళ్లిపోవడానికి చాలా బాధపడుతున్నాను అంటూ ఇంద్రజ తెలియజేసింది. ఇంద్రజ వెళ్ళిపోతూ ఉంటే కమెడియన్స్ సైతం చాలా ఎమోషనల్ గానే మాట్లాడినట్లుగా తెలుస్తోంది. మరి జబర్దస్త్ జడ్జి స్థానంలో ఎవరు వస్తారు అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: