ప్రపంచంలోనే తొలి రోబోగా మానవ కాంత సోఫీయా గా ఆవిర్భవించింది. హాలీవుడ్ నటి అయిన ఆడ్రీ హెబ్బన్ ప్రతిరూపంగా ఆమె పోలికలతోనే రోబో సోఫియా ని సృష్టించారు.మనుషుల లో జ్ఞానేంద్రియాలు ఉన్నట్టు సోఫియా కు కూడా ఈ నాలుగు శక్తులు ఉన్నాయి. అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విజువల్ డేటా ప్రాసెసింగ్, ఫేషియల్ రికగ్నిషన్, వాయిస్ రికగ్నిషన్. ఇక వీటి ద్వారా రోబో సోఫియా చూస్తుంది, వింటుంది,మాట్లాడుతుంది, ఆలోచన చేస్తుంది. మనుషులు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో ఈ రోబోలు కూడా అదేవిధంగా ప్రవర్తనను కలిగి ఉంటాయి. ఇక త్వరలోనే గ్రేస్ రోబో కూడా ఆవిర్భావం కావడంతో వైద్య రంగంలో సేవలు అందించడానికి సహకరిస్తాయని చెప్పవచ్చు.