లాప్టాప్ బ్యాటరీని ఛార్జింగ్ చేసేటప్పుడు,సోఫా మీద కానీ,మంచం మీద కానీ పెట్టి,చార్జింగ్ పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల బ్యాటరీ లోని వేడి బయటకు పోకుండా అలాగే నిక్షిప్తమై బ్యాటరీ త్వరగా పాడైపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి చార్జింగ్ పెట్టేటప్పుడు గాలి తగిలే ప్రదేశంలో లేదా టేబుల్ పైన పెట్టి చార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది.