అమెరికాకు చెందిన "బయో మెడికల్ ఇంజనీర్లతో పాటు యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన పరిశోధకులు గ్లూ 'గమ్ 'ను" అభివృద్ధి చేశారు. దానికి "మెట్రో" గా నామకరణం చేశారు. సదరు గ్లూ ను గాయాలపై అప్లై చేయగానే కొన్ని నిమిషాల వ్యవధిలోనే, ఇది గాయాలను సీజ్ చేస్తుంది. దీంతో గాయం అయిన ప్రాంతం క్లోజ్ అవుతుంది. ఫలితంగా గాయం త్వరగా మానుతుంది.అయితే గ్లూ ని అప్లై చేశాక, అల్ట్రావయోలెట్ కిరణాల సాయంతో దీన్ని ఆక్టివేట్ చేయాలి. అలా ఆక్టివేట్ అయిన తర్వాత గ్లూ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇక దీన్ని ఇప్పటికే మన చుట్టూ ఉండే జంతువుల పైన, పందులు, ఇతర జీవుల పైన ప్రయోగించి విజయం సాధించారు. దీంతో త్వరలోనే మనుషులపై ఒక ట్రైలర్ చేపట్టనున్నారు. ఆ తర్వాత గ్లూ వాణిజ్య పరంగా మొత్తం దేశమంతటా మార్కెట్లోకి వస్తోంది.