కేంద్ర ప్రభుత్వం కార్మిక ఉద్యోగుల కోసం నాలుగు పనిదినాలను కేటాయించింది. అయితే ఇందులో ఒక కిటుకు కూడా ఉంది. వారానికి నాలుగు రోజులు పని చేయాలనుకునేవారు రోజుకి 12 గంటల పాటు చేయాల్సి ఉంటుంది. అదే పని దినాలు 6 కావాలనుకునేవారు రోజుకు ఎనిమిది గంటలు చేస్తే సరిపోతుంది. అయితే ఈ రెండు ఆప్షన్లను కేంద్ర ప్రభుత్వం కార్మిక ఉద్యోగుల కే ఇచ్చింది. ఈ నిర్ణయంపై ఎవరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా,తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది