చిత్తూరు జిల్లా..తొట్టంబేడు మండలం.. శేషమ నాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి కుమారుడు తపాలా నాదముని అనే ఈ కుర్రాడు ఒక అద్భుతం సృష్టించాడు. ఈ అబ్బాయి పదవ తరగతి చదువుతున్నాడు.2.2 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన వ్యాక్యూమ్ క్లీనర్ ను రూపకల్పన చేసి, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు కాగా, ఆ తర్వాత తన రికార్డును తానే బద్దలు కొడుతూ, కేవలం 1.7 సెంటీమీటర్ల పరిమాణం కలిగిన వాక్యూమ్ క్లీనర్ ను కనుగొని, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు..